India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పోలీస్ శాఖ తరఫున విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రజలు శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
మీ సేవ సెంటర్లలో శనివారం సర్వర్ డౌన్ ప్రాబ్లమ్ ఎదురైంది. దీనితో మీ సేవ సెంటర్లకు వెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా సర్వర్ డౌన్ చూపగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సెంటర్లలో పడిగాపులు కాశారు. కాగా రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధిక సంఖ్యలో అభ్యర్థులు రావడంతో ఈ ఇక్కట్లు అని తెలిసింది.
నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. శుక్రవారం మెండోరాలో 41.5℃, పెర్కిట్, మోర్తాడ్, కోటగిరి 41.4, మల్కాపూర్, వేంపల్లె 41.3, లక్మాపూర్, యడపల్లి 41.2, ముప్కాల్, వైల్పూర్ 41.1, కమ్మర్పల్లి, యర్గట్ల, కొండూరు 41, బాల్కొండ 40.9, మంచిప్ప 40.8, గోపన్నపల్లి, తొండకూర్ 40.7, మోస్రా, మగ్గిడి 40.5, రెంజల్, సిరికొండ, భీంగల్, మాచెర్ల 40.4, ధర్పల్లి, గన్నారం, కోనసమందర్లో 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.
కరెంట్ షాక్‌తో మృతి చెందినపై ఫోటోలోని వ్యక్తిని గుర్తు పడితే తమకు సమాచారం ఇవ్వాలని నిజామాబాద్ 1వ టౌన్ SHO రఘుపతి కోరారు. ఇతను నెహ్రు పార్క్ ఏరియా దగ్గర ఉన్న లేబర్ అడ్డా దగ్గర నుంచి పనికి వెళ్తు ఉంటాడన్నారు. శుక్రవారం ఖలీల్వాడి, నిజామాబాద్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న భవనంలో పని చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని చెప్పారు. ఇతడి గురించి తెలిస్తే తమకు సమాచారం అందించాలన్నారు.
అక్రమంగా విక్రయిస్తున్న ఎండు గంజాయిని టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. టాస్క్‌ఫోర్స్ DPEO ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ CI సీహెచ్. విలాస్, SI సింధు ఆధ్వర్యంలో ఖానాపూర్ గ్రామంలోని జన్నెపల్లి రోడ్డులో రైల్వేగేట్ వద్ద మాలపల్లికి చెందిన సోహెబ్ ఖాన్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో 2100 గ్రాముల ఎండు గంజాయి లభించింది. అతణ్ని అరెస్టు చేసి ఎస్హెచ్ఓకు అప్పగించారు.
నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రలో చంద్రకళ(55) అనే మహిళా హత్యకు గురైంది. కూలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ నెల 23వ తేదీన కూతురితో మాట్లాడిన చంద్రకళ మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన కూతురు రమ్య ఇంటికి వచ్చి చూసే సరికి హత్యకు గురైంది. సమాచారం అందుకున్న 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 30, 31 తేదీల్లో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాలు పని చేస్తాయని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఏజీఎం సీతారాం తెలిపారు. 30న ఉగాది, 31 రంజాన్ సందర్భంగా వినియోగదారులకు బిల్లు చెల్లింపు కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు.
వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు.
NZB నగర శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. మహిళ మృతదేహాన్ని కారు డిక్కీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలు కమలగా పోలీసులు గుర్తించారు. కంఠేశ్వర్ బైపాస్ వద్ద మహిళను హత్య చేసి, మాక్లూర్‌లోని దాస్ నగర్ కెనాల్‌లో పడేసేందుకు కారు డిక్కీలో మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.