India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు చేపట్టిన ఎస్ఐలు ఇవాళ సీపీ సాయిచైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు. సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రతీ ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. రైల్ రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని, బిల్లును ఆమోదించకపోతే భవిష్యత్తులో నిరవధికంగా రైల్‌రోకోను నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం ఆయన బోధన్ మున్సిపాలిటీలో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ప్లాట్ల క్రమబద్దీకరణ దరఖాస్తుదారులకు అనుమతుల మంజూరు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ కృష్ణ మోహన్‌ను నియమిస్తూ వైద్య ఆరోగ్య, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం మహేశ్వరం మెడికల్ కళాశాలలో జనరల్ సర్జన్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ శివ ప్రసాద్ కొనసాగుతున్నారు.
నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు ASIలకు SIలుగా పదోన్నతి కల్పిస్తూ CP సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ASI నాగభూషణం, మాక్లూర్ PSలో పని చేస్తున్న నర్సయ్య, NZB త్రీ టౌన్‌లో పని చేస్తున్న లీలా కృష్ణకు SIలుగా పదోన్నతులు కల్పించారు. నాగభూషణం, నర్సయ్యలను నిర్మల్ జిల్లాకు, లీలా కృష్ణను ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశారు.
భీమ్‌గల్ మండలంలో దారుణం జరిగింది. కడుపులో దాచుకోవాల్సిన తల్లి బిడ్డను కడతేర్చింది. తన కూతురిని భార్యే హత్య చేసిందని భర్త ఫిర్యాదు చేసినట్లు SI సందీప్ తెలిపారు. గోనుగొప్పుల వాసి మల్లేశ్- రమ్య దంపతులకు శివాని(5) సంతానం. రమ్య తాగుడుకు బానిసై చిన్నారిని పట్టించుకోవడం లేదు. దీంతో మల్లేశ్ భార్యను పలు మార్లు మందలించాడు. బిడ్డ కారణంగానే గొడవలు జరుగుతున్నాయని భావించిన రమ్య ఈనెల 6న హత్య చేసిందన్నారు.
ఈ నెల 10 నుంచి 16 వరకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం ఆయన జిల్లా సమాఖ్య సమావేశంలో మాట్లాడుతూ.. విజయోత్సవ సంబరాల సన్నద్ధత, కార్యాచరణ కోసం ఈ నెల 8న అన్ని మండలాలలో మండల సమాఖ్య సమావేశాలు, 9న గ్రామ సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.
నిజామాబాద్ మొదటి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అనంతగిరికి చెందిన నర్సింహారెడ్డి ఇంటర్మీడియట్ విద్యను ఖిల్లా కళాశాలలో, డిగ్రీ, లా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్-జానకంపేట్ మధ్య KM.No 456-14 సమీపంలో ఆదివారం ఓ మహిళ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింనట్లు పేర్కొన్నారు. ఆమె సంబంధించిన వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.