Nizamabad

News March 30, 2026

NZB: గ్రామ/వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన గ్రామ పంచాయతీల్లో నిర్వహించనున్న గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న వార్డు సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందస్తుగానే గ్రామ/వార్డు సభల వేదికలను సందర్శించి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలన్నారు.

NZB: కొమ్మ కొమ్మకీ వజ్రం పొదిగినట్లుగా..!

image

నగరంలోని మహాలక్ష్మీ నగర్ కాలనీలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి ఒక భారీ చెట్టుపై వేలాది దూది పువ్వులు పూసి, కొమ్మకొమ్మకూ వజ్రాలు పేర్చినట్లుగా కనిపిస్తున్నాయి. ప్రకృతి కురిపించిన మణిహారంలా మెరుస్తున్న ఈ దృశ్యం చూపరులను అబ్బురపరుస్తోంది. వజ్రాలు పొదిగినట్లుగా ఉన్న ఈ పూల సోయగాన్ని చూసి కాలనీవాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ అపురూప సౌందర్యం అద్వితీయం.

News March 30, 2026

నిజామాబాద్: తొలి ముద్దతో పోషక విప్లవం..!

image

చిన్నారుల ఆరోగ్యమే పరమావధిగా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 3,120 అంగన్‌వాడీ కేంద్రాల్లో త్వరలోనే ‘తొలి ముద్ద’ పథకం ద్వారా పౌష్ఠికహరంతో కూడిన అల్పాహారాన్ని అందించనుంది. ఈ నిర్ణయంతో దాదాపు 1.50 లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది. బలవర్ధకమైన ఆహారాన్ని అందించడం ద్వారా బాలల్లో వేధిస్తున్న పోషకాహార లోపాన్ని, రక్తహీనతను నివారించాలని సర్కార్ యోచిస్తోంది.

News March 30, 2026

నిజామాబాద్: 471 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 2 వారాల్లో (ఈనెల 16 నుంచి 28వ తేదీ వరకు) 471 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వారందరినీ కోర్టుల్లో హాజరుపరచగా రూ.43.30లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే 38 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారని CP వివరించారు.

News March 29, 2026

నిజామాబాద్: లోక్ అదాలత్‌లో 5,662 కేసులు క్లియర్

image

జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 5,662 కేసులు పరిష్కారమైనట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. సైబర్ బాధితులకు రూ.31.82 లక్షల నగదును తిరిగి అందజేశామన్నారు. రాజీ మార్గమే రాజా మార్గం అని అన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ఇది ఉత్తమ వేదిక అని సీపీ పేర్కొన్నారు. కాగా లోకదాలత్ ద్వారా ఇది వరకే పెద్ద ఎత్తున కేసులు పరిష్కారం అయినట్లు ఆయన వివరించారు.

News March 29, 2026

NZB: బహిరంగ క్షమాపణ చెప్పిన కవిత

image

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయినందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బహిరంగ క్షమాపణ చెప్పారు. ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ధర్నాకు కవిత మద్దతు ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వ పాపంలో తనకు భాగం ఉందని తనను క్షమించాలని కోరారు. వెంటనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

News March 29, 2026

NZB: ఆరుగురికి వారం రోజుల చొప్పున జైలు

image

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆరుగురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు. నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 35 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.3.50 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News March 29, 2026

​నిజామాబాద్: కళ్లాల్లో ధాన్యం.. ఎదురుచూపుల్లో అన్నదాత

image

నిజామాబాద్ జిల్లాలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి పంట చేతికొచ్చినా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం రైతులను కలవరపెడుతోంది. ఆరబోసిన ధాన్యం కుప్పల వద్దే రైతులు పడిగాపులు. అకాల వర్షాలు కురిస్తే రూపాయల పంట తడిసి ముద్దవుతుందని ఆందోళన చెందుతున్నారు. వెంటనే కేంద్రాలను ప్రారంభించి, మద్దతు ధరతో ధాన్యం సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.