India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఏఓ ప్రశాంత్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ పాల్గొన్నారు.
నిజామాబాద్ మొదటి జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గాంధారి నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని అనంతగిరికి చెందిన నర్సింహారెడ్డి ఇంటర్మీడియట్ విద్యను ఖిల్లా కళాశాలలో, డిగ్రీ, లా ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కోర్టులో సుదీర్ఘకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే SI సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్-జానకంపేట్ మధ్య KM.No 456-14 సమీపంలో ఆదివారం ఓ మహిళ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింనట్లు పేర్కొన్నారు. ఆమె సంబంధించిన వివరాలు తెలిస్తే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.
ఈ నెల 13న నిజామాబాద్ ఊర పండుగ నిర్వహించనున్నట్లు నగర సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌లోని సిర్నాపల్లి గడిలో పండుగ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఊర పండుగను పురస్కరించుకొని ఖిల్లా చౌరస్తా నుంచి పెద్దబజార్, ఆర్య సమాజ్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్ వరకు గ్రామ దేవతల ఊరేగింపు ఉంటుందన్నారు. గురువారం బండారు వేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని SGTU నాయకులు కోరారు. ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కరీంనగర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేసే టీచర్స్‌కు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరారు. B.Ed, D.Ed వారికి కామన్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు కల్పించాలని SGTU అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి కోరారు.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఏకలవ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సామాజికవర్గానికి అన్ని పార్టీలు రాజకీయంగా అవకాశాలు కల్పించాలని సూచించారు.
నిజామాబాద్ నగరంలో నటి అనసూయ ఆదివారం సందడి చేసింది. హైదరాబాద్ రోడ్డులోని ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పలు పాటలకు స్టెప్పులు వేసి ఉర్రూతలూగించారు. ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇందూరులో తనకు ఇంత మంది అభిమానులు ఉండటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నట్లు నిజామాబాద్ 4వ టౌన్ SI శ్రీకాంత్ శనివారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. వినాయక్ నగర్‌కు చెందిన మల్లెపూల సందీప్ కుమార్(36) వ్యాపారంలో నష్టాలకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అబార్షన్ అయ్యిందని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పొతంగల్ మండలం కొడిచర్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడిచర్ల సుధాకర్‌తో మహాదేవి(28)కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ఇటీవల గర్భం దాల్చగా పిండం సరిగా లేక అబార్షన్ అయ్యంది. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.