India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లేఔట్ల క్రమబద్దీకరణకు ఎల్‌ఆర్‌ఎస్ 25 శాతం రాయితీ అవకాశాన్ని నిర్ణీత గడువులోగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఎల్ఆర్ఎస్ సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతన నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. ఎఫ్‌టీఎల్, నిషేధించిన సర్వే నంబర్లు మినహా దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించిందని కలెక్టర్ సూచించారు
నిజామాబాద్ తపాలా విభాగంలో వివాదాల పరిష్కారానికి మార్చి 25న 49వ డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సూపరింటెండెంట్ జనార్ధన్ తెలిపారు. పోస్టల్ విభాగంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న మనీ ఆర్డర్, స్పీడ్ పోస్ట్, బీమా, ఆర్‌డీ పథకాలు తదితర సమస్యలు సంబంధిత అధికారులు పరిష్కారిస్తారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇంట్లో ఎవరూలేని సమయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు మహిళలను గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఠాణాకలాన్‌లో చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన గిర్మారెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం NZBలో నివాసముంటున్నాడు. గత 9 నెలలుగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గమనించిన బెంగి గంగామణి, ఎరుకల శ్యామల, సునీతలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో చోరి చేస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.
నిజమాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. శుక్రవారం కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం లభించినపట్టికీ పంటలకు నష్టం జరిగే అవకాశం ఉండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
ఇంటర్ పరీక్షల మూల్యాంకనం ప్రారంభమైనట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఇప్పటికే సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ నెల 22న మొదటి దశ (ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్), 24 నుంచి రెండో దశ (ఫిజిక్స్, ఎకనామిక్స్), 26 నుంచి మూడో స్పెల్ (కెమిస్ట్రీ, కామర్స్), 28వ తేదీ నుంచి నాలుగో స్పెల్ (హిస్టరీ, బోటనీ, జువాలజీ) మూల్యాంకనం ప్రారంభమవుతుందని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు 22వ తేదీన నిర్వహించనున్నట్లు DIEO రవికుమార్ తెలిపారు. గురువారం రెండో సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించారు. 438 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 15,896 మంది విద్యార్థులకు 15,458 మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. మొత్తం 97.2% విద్యార్థులు పరీక్షలు రాశారు.
రాష్ట్ర బడ్జెట్ నిజామాబాద్ జిల్లా ప్రజలను నిరాశపరిచింది. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టుకు సంబంధించి భూసేకరణ ఊసేలేదు. కాగా శ్రీరాంసాగర్ మెుదటి దశ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించారు. కాగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ.. జిల్లాకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.
యువ శాస్త్రవేత్తలకు ఇస్రో ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఈ సారి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ నెల 23వ తేదీలోగా www.isro.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా బాలికల జట్టు ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా వనపర్తి జిల్లాలో జరిగిన అండర్ 14 బాలికల రాష్ట్రస్థాయి పోటీల్లో ఫైనల్ మ్యాచ్‌లో నిజామాబాద్, ఆదిలాబాద్ జట్లు తలపడ్డాయి. ఇందులో జిల్లా జట్టు 2-0 గోల్ తేడాతో విజయం సాధించింది.
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బుధవారం అధికారులతో జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.