Nizamabad

News August 14, 2024

పిట్లం: జేబులో పేలిన సెల్ ఫోన్

image

ఓ వ్యక్తి ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ ఒకసారిగా పేలింది. ఈ ఘటన పిట్లంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఎనిగే సాయిలు అనే వ్యక్తి తన మొబైల్‌ని ఎప్పటిలాగే ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మొబైల్ పేలింది. జేబులోంచి మొబైల్ తీసేలోపే మంటలు అంటుకొని జేబు కాలిపోయింది. ఈ ఘటనలో అతనికి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది.

News August 14, 2024

నిజామాబాద్ నగరంలో కొనసాగుతున్న బంద్

image

బంగ్లాదేశ్‌లో హిందూ ఆడబిడ్డలపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా బుధవారం నిజామాబాద్ నగరంలో బంద్‌‌ కొనసాగుతోంది. వివిధ హిందూ సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు నగరంలో ఉన్న వివిధ మర్చంట్ సంఘాల నాయకులు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్ యాజమాన్యాలు అందరూ స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తున్నారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

News August 14, 2024

బీర్కూర్: ఆర్టీసీ బస్సుపై తెగిపడిన విద్యుత్ తీగలు

image

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మంటలు చెలరేగటంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 14, 2024

నిజామాబాద్‌లో ఈరవత్రి అనిల్.. కామారెడ్డిలో పటేల్ రమేశ్ రెడ్డి

image

ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, కామారెడ్డి జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి జెండాను ఎగురవేయనున్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీచేశారు.

News August 14, 2024

నేటి నుండి యూత్ కాంగ్రెస్ ఎన్నికలు..

image

NZB: నేటి నుంచి జిల్లాలో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు మొదలు కానున్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున దీనికి త్రీవ్ర పోటీ నెలకొంది. నేటి నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 14 వరకు కాంగ్రెస్ కి సంబంధించిన అప్లికేషన్(WITH IYC) లో ఓటు వేయాలని జిల్లా కాంగ్రెస్ యూత్ విభాగం తెలిపింది. ఇందులో జిల్లా స్థాయి మరియు నియోజకవర్గ స్థాయికి సంబంధించిన అభ్యర్థులు పోటీ పడతారు.

News August 14, 2024

బంగ్లాదేశ్‌లో దాడులను నిరసిస్తూ నేడు నిజామాబాద్ నగర బంద్

image

బంగ్లాదేశ్‌లో హిందూ ఆడబిడ్డలపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా బుధవారం నిజామాబాద్ బంద్‌‌కు పిలుపునిస్తున్నట్లు వివిధ హిందూ సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. నగరంలో ఉన్న వివిధ మర్చంట్ సంఘాల నాయకులు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్ యాజమాన్యాలు అందరూ స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు.

News August 14, 2024

నవీపేట్: ఇసుక అక్రమ రవాణా.. రూ. 20,000 జరిమానా

image

నవీపేట్ మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్‌ను తహశీల్దార్ నారాయణ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. రెంజల్ మండలం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. టిప్పర్ యజమానికి మంగళవారం రూ.20వేల జరిమానా విధించినట్లు తెలిపారు. అక్రమంగా మొరం, ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తాసిల్దార్ నారాయణ తెలిపారు.

News August 13, 2024

ఉమ్మడి NZB జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

* NZB: దత్తత తీసుకున్న బాలుడికి చిత్రహింసలు
* NZB: పోలీస్ స్టేషన్ లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
* బాన్సువాడ ఉప ఎన్నిక ఖాయం: KTR
* లింగంపేట్: యువకుడిపై ఎలుగు బంటి దాడి
* నిజామాబాద్ కు జిల్లాకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి పొన్నం
* పిట్లం: చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
* పోతంగల్: రాత్రి అక్రమ ఇసుక సీజ్.. ఉదయం ఇసుక మాయం
* లంచం తీసుకున్న విద్యుత్ శాఖ AE.. ఏడాది జైలు శిక్ష

News August 13, 2024

బాన్సువాడలో ఉపఎన్నిక ఖాయం: KTR

image

బాన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ శ్రేణులు మంగళవారం కేటీఆర్‌ను కలిశారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీ వీడలేదని బీఆర్ఎస్‌కు కార్యకర్తలే కొండంత అండ అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారంను ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని ధీమా వ్యక్తం చేశారు.

News August 13, 2024

BREAKING.. NZB: పోలీస్ స్టేషన్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లోని ఎస్సై గదిలో ఎస్సై లేని సమయంలో రమేశ్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది హుటాహుటిన అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు వ్యక్తి ఎస్సై ఛాంబర్లోకి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడినా అక్కడి సిబ్బంది పట్టించుకొకపోవడం గమనార్హం.