India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మోస్రా, జకోరా, ఎడపల్లి 38.9°C, గోపన్ పల్లి, మదన్ పల్లి, పెర్కిట్ నిజామాబాద్(నార్త్) 38.8, నిజామాబాద్(సౌత్), కోటగిరి 38.7, మోర్తాడ్ 38.6, సాలూరా, మాచర్ల 38.5°C అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని 45 వెదర్ స్టేషన్లలో 35°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా తుంపల్లిలో 14మి.మీ వర్షపాతం రికార్డు అయ్యింది.

యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు పడకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కలెక్టరేట్లో మంగళవారం ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

వేసవిలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రత, చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయా శాఖల వారీగా అధికారులకు బాధ్యతలు పురమాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.

ప్రస్తుత వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ఆర్.డబ్ల్యూ,ఎస్, పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ప్రతి నివాస ప్రాంతానికి ప్రజల అవసరాలకు సరిపడా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎం.పీ.ఓలు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అవసరమైన చోట చిన్న చిన్న మరమ్మతులను వెంటనే చేపట్టాలన్నారు.

విధి నిర్వహణలో ఎవరైనా కావాలని నిర్లక్ష్యానికి తావిస్తే, కేవలం సస్పెన్షన్ తోనే సరిపెట్టకుండా బాధ్యులైన వారిపై మరింత కఠిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల పదవ తరగతి పరీక్షల సందర్భంగా ఎస్జీటీ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును కలెక్టర్ ప్రస్తావిస్తూ, పైవిధంగా హెచ్చరికలు చేశారు.

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 140 ఫిర్యాదులు అందాయి.

10వ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మానిక్ భవన్ పాఠశాలతో పాటు నలంద హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. ఎక్కడ కూడా కాపీయింగ్‌కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

ఎండల తీవ్రత దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేసవిలో ప్రతి నెలా కార్డుదారులు ఎండలో వరుస కట్టాల్సిన ఇబ్బందులు కలగకుండా ఈ వెసులుబాటు కల్పించారు.
ఇందుకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలోని సుమారు 15,94,782 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
Sorry, no posts matched your criteria.