India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ జిల్లాలో మాంసం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చికెన్ విత్ స్కిన్ కిలో రూ.320, స్కిన్‌లెస్ రూ.358కి చేరింది. మటన్ ధరలు సైతం పైపైకి వెళ్తున్నాయి. సాధారణ మేక మాంసం రూ.500-600 పలుకుతుండగా, పొట్టేలు మాంసం రూ.800 నుంచ రూ.900 వరకు విక్రయిస్తున్నారు. వేసవి ఎండల ప్రభావం, శుభకార్యాల వల్ల పెరిగిన డిమాండ్‌తో ధరలు భారీగా పెరగడంతో మాంసాహార ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు.

“నీరు లేనిదే జీవం లేదు.. నీటిని పొదుపుగా వాడటం మనందరి బాధ్యత” అనే నినాదంతో నేడు ప్రపంచ జల దినోత్సవం నిర్వహించనున్నారు. కురుస్తున్న వర్షాలు, ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వంటి పథకాల వల్ల జిల్లాలో భూగర్భ జలాలు గతంలో కంటే కొంత మెరుగయ్యాయి. అయినప్పటికీ “ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడడంతో పాటు తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతను నిర్మించుకోవడం, బావులను, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’.

నేటి తరం విద్యార్థులు సిలబస్ అనే చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నారు. కానీ తడపాకల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదవడం, రాయడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కలాలు పట్టి తేలికపాటి పదాలతో అందరికీ అర్థమయ్యేలా కథలు, కవితలు రాసేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటి పురస్కారాలు, ప్రశంసలు పొందుతున్నారు. ఇప్పటి వరకు 15కి పైగా సంపుటులు ఆవిష్కరించారు.
# నేడు ప్రపంచ కవితా దినోత్సవం

నిజామాబాద్ జిల్లాలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎండల తీవ్రతతో కోళ్ల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.325 పలుకుతుండగా, డ్రెస్డ్ చికెన్ రూ.286-290 మధ్య ఉంది. రంజాన్ పండుగను పురస్కరించుకుని గత నెలతో పోలిస్తే కిలోపై రూ.80 వరకు పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఆందోళనకరంగా తగ్గుతోంది. గత రెండు దశాబ్దాల్లో సుమారు 580 హెక్టార్ల అటవీ సంపద హరించుకుపోయింది. ముఖ్యంగా అటవీ అంచున ఉన్న గ్రామాల్లో ‘పోడు సాగు’ పెరగడం వల్ల చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. వందల ఎకరాల అటవీ భూమి సాగు భూమిగా మారుతోంది. అటవీ అధికారులు నిఘా పెంచినప్పటికీ, పోడు సాగును అరికట్టడం సవాలుగా మారింది.
# నేడు ప్రపంచ అటవీ దినోత్సవం

NZB నగరంలోని పేకాట స్థావరంపై CCS టీం మెరుపు దాడి నిర్వహించింది. శుక్రవారం 6వ పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంగాపూర్ మిషన్ భగీరథ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నామని CCS ACP మస్తాన్ వలీ చెప్పారు. 4 సెల్ ఫోన్లు, 4 బైక్‌లు, ఒక ఆటో, రూ.11,170 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్య నిమిత్తం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ SHOకి అప్పగించామన్నారు.

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కవిత అన్నారు. ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు మోపారని, రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని విమర్శించారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, దివ్యాంగులు అందరినీ మోసం చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేక్ తున్నారన్నారు.

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నియమ నిష్ఠలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. శనివారం నాటి ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ను కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.

రాష్ట్రంలో 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నేటి రాష్ట్ర బడ్జెట్లో రూ.500 కోట్లను ప్రతిపాదించారు. ఈ నిధులతో NZB జిల్లాలోని కందకుర్తితో పాటు TGలోని బాసర, ధర్మపురి, కాలేశ్వరం, భద్రాచలం ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పించి కుంభమేళా తరహా పుష్కరాలు జరుపనున్నారు. ఈ ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష జరిపారు.

ఒకప్పుడు మన ఇంటి ముంగిట సందడి చేసిన పిచ్చుకలు నేడు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. వాటి ప్రాముఖ్యతను గుర్తించి, వాటిని సంరక్షించాలన్న ఉద్దేశంతో నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నేచర్ ఫరెవర్ సొసైటీ వ్యవస్థాపకుడు Md దిలావర్ కృషితో 2010లో మొదటి సారిగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. NZBకు చెందిన మంచాల జ్ఞానేందర్ పిచ్చుకల కోసం నీరు, ఆహారం పెట్టేలా ఫీడర్లు పంపిణీ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.