India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని విద్యార్థినులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఉచితంగా నిర్వహించనున్నట్లు సీపీ సాయి చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి మే 2 వరకు నిజామాబాద్ RBVRRస్కూల్‌లో శిబిరం ఉంటుందన్నారు. దీనికి 9,10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఇందులో సెల్ఫ్ డిఫెన్స్, మోటివేషన్ సమాజంలో మహిళలపై జరిగే నేరాలపై పోలీస్ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16నుంచి జరగబోయే ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రయివేటు కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయమై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసన తెలియజేస్తూ బహిష్కరణే మార్గమని తలచి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌కు బహిష్కరణ లేఖను పంపారు.
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 16నుంచి జరగబోయే ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ప్రయివేటు కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ విషయమై ప్రభుత్వ మొండి వైఖరికి నిరసన తెలియజేస్తూ బహిష్కరణే మార్గమని తలచి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌కు బహిష్కరణ లేఖను పంపారు.
సెల్‌ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించినందుకు యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోటగిరికి చెందిన లక్ష్మణ్ (20) అనే యువకుడు ఎక్కవ సమయాన్ని సెల్ ఫోన్ వాడకానికి కేటాయిస్తున్నాడని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సందీప్ తెలిపారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
అయోధ్య శ్రీరాముడి ఆశీస్సులతో బలమైన రామరాజ్య స్థాపన ఏర్పాటు కావాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆకాంక్షించారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్‌లో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రను ఆయన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణతో కలిసి కంఠేశ్వర్ ఆలయం వద్ద లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణలో రామరాజ్య స్థాపన జరగాలని అంజన్న స్వామిని వేడుకుంటున్నామన్నారు.
చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో చోటు చేసుకుంది. మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, అతని బావమరిది మహమ్మద్ రఫీక్ నిన్న సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫిక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతన్ని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగగా ఇద్దరు మునిగిపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ఆసిఫ్ అలీని అదుపులోకి తీసుకున్నట్లు సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. నరేశ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ లతీఫ్ కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్ అలీ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని సమాచారం మేరకు 6వ టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి అర్సపల్లి బైపాస్ రోడ్డు వద్ద అతనిని పట్టుకొని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఇటీవల కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 99మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సమీక్ష జరిపి వరుస కల్తీ ఘటనలపై ఆరా తీయనున్నారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ అధికారులు హాజరుకానున్నారు. దామరంచ, అంకోల్, దుర్కి, సంగెం మండలాల్లో 69మంది, గౌరారంలో 30 మంది కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురుని అరెస్టు చేశారు. 27మందిపై కేసు నమోదుచేశారు.
జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైన్స్ బంద్ చేయాలని సీపీ సాయి చైతన్య సూచించారు. హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలోని మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసి ఉంటాయన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పేరిట సాంఘిక బహిష్కరణలు విధిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, అలాంటి వీడీసీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధికి వీడీసీలు కృషి కొనసాగిస్తే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదని, వీడీసీ ముసుగులో చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు పూనుకుంటే ఎంతమాత్రం చర్యలు తప్పవన్నారు.
Sorry, no posts matched your criteria.