India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ నగర శివారులోని న్యాల్కల్లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. బైక్ పై వచ్చిన తండ్రి, కూతురు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వారు నగరంలోని వర్ని చౌరస్తాకు చెందిన క్రాంతి(35), కూతురు (7)గా స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాలే తప్ప గత పదేళ్లలో BRS చేసింది శూన్యమని బోధన్ MLA సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం రెంజల్లో ఆయన పలు అభివృద్ధి పథకాలకు భూమిపూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, KCR రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పోయారన్నారు. కాంగ్రెస్కు ప్రజలే పట్టం కట్టారని పేర్కొన్నారు. త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించుదామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే అధికారంలోకి వచ్చిన పదినెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదన్నారు. కాగా పార్టీ మారిన వ్యక్తులను ప్రజలకు క్షమించరని పేర్కొంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామన్నారు.
సైనిక సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనికులకు TGS RTCలో ఉద్యోగాలు కల్పించనుంది. ఈ మేరకు RTC నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,201 డ్రైవింగ్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 110 ఉద్యోగాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 18నెలల అనుభవంతో కూడిన హెవీ డ్యూటీ లైసెన్స్, 58 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు అర్హులు. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
జిల్లాలో 23 శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. PM కిసాన్ సమ్మాన్ నిధికి రూ.531.6 కోట్లు, మధ్యాహ్న భోజనం రూ.9.68 కోట్లు, ఉపాధి హామీ పథకం రూ.73 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.36.75 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.61.25 కోట్లు, RRRకు రూ.16.63 కోట్లు, MP లాడ్స్కు రూ.59.37 లక్షలు, PM ఆదర్శ్ గ్రామ యోజన పథకానికి రూ.49.50 లక్షలు ఖర్చు చేశామన్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సమష్టి సహకారంతో పనిచేయాలని MP సురేశ్ షెట్కార్ అన్నారు. శనివారం దిశ సమావేశంలో ఎమ్మెల్యే KVRతో కలిసి ఆయన పాల్గొన్నారు. 18వ లోక్సభ ఏర్పడిన తర్వాత మొదటి దిశ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారుల సహకారంతో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు.
త్వరలో నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్- కరీంనగర్ పరిధిలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా మంది పట్టభద్రులు, టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అర్హులు ఇంకా ఎవరైనా ఉండవచ్చన్న అనుమానంతో డిసెంబర్ 9 వరకు ఓటుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. 2021 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి అయిన వాళ్లు ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
బోధన్ డివిజన్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 93% పూర్తయిందని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అన్నారు. మిగిలిన సర్వేను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. బోధన్ పట్టణంలో 88% సర్వే పూర్తి చేశామన్నారు. బోధన్ డివిజన్లో డేటా ఎంట్రీని కూడా ప్రారంభించామని తెలిపారు.
నిజామాబాద్లో దారుణం చోటుచేసుకుంది. సొంత చెల్లెలిపై అన్న పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని ఓ టౌన్ పరిధికి చెందిన బాలికపై(17) సొంత అన్న లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. విషయం బాలిక తండ్రికి తెలియడంతో అతడు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
సన్న వడ్లకు రూ.500 చొప్పున బోనస్ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శుక్రవారం ఆయన రైతులతో మాట్లాడారు. నిర్ణీత గడువులోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామన్నారు. ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా అందరి సహకారంతో జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తున్నామని వివరించారు.
Sorry, no posts matched your criteria.