India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు భారీగా పసుపు తీసుకుని వస్తున్నారు. శివరాత్రి తరువాత మార్కెట్ కు వరుస సెలవులు రావడంతో నిన్నటి నుంచి భారీగా పసుపు వస్తోంది. దీనితో మార్కెట్ పసుపు మయంగా మారింది. కాగా నిన్న హై గ్రేడ్ పసుపు కొనుగోలు ధర రూ.13,311 పలుకగా మీడియం రూ.11,30, లో గ్రేడ్ రూ.10 వేలు పలికింది.
నిజామాబాద్ నగరంలో మంగళవారం కత్తిపోట్ల కలకలం చెలరేగింది. నగరంలోని గాజుల్ పేట్‌లో ఓ సంఘం సమావేశంలో జరిగిన పరస్పర వాదనలు కాస్తా కత్తిపోట్లకు దారితీశాయి. సంతోష్ అనే వ్యక్తిని ఒకరు కత్తితో పొడిచి గాయపరిచాడు. కత్తిపోట్లలో గాయపడిన క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉమ్మడి ADB-NZB-MDK-KNR గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.
వర్క్‌ఫ్రం హోమ్ పేరుతో ఓ యువతి మోసపోయినట్లు నిజామాబాద్ 1టౌన్ SHO రఘుపతి తెలిపారు. రామ్ గోపాల్ స్ట్రీట్‌కు చెందిన యువతి ఫేస్‌బుక్‌లో రిల్స్ చూస్తుండగా వర్క్ ఫ్రం హోమ్ అనే యాడ్ చూసి ఆకర్షితులై ఓ నంబరుకు వాట్సాప్ ద్వారా లింక్ పంపింది. తన బ్యాంక్ వివరాలను పంపి, రిజిస్ట్రేషన్ ఫీ 90,300 ఫోన్ పే ద్వారా చెల్లించింది. దీంతో మోసపోయానని భావించి వన్ టౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
ఆలూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన చలిగంటి మోహన్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులు పెరగడంతో గత ఐదు నెలల క్రితం దుబాయ్ వెళ్లి డెలివరీ బాయ్‌గా పని చేస్తుండగా ఫిబ్రవరి 23న కారు ప్రమాదంలో మరణించాడు. సోమవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మోహన్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్థులు కోరారు.
ఫిర్యాదుదారుని పేరు మీద ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినందుకు రూ.10 వేలు లంచం తీసుకున్న కేసులో సోమవారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిజామాబాద్ జాయింట్ సబ్-రిజిస్ట్రార్-II చెన్న మాధవాణి శ్రీరామ రాజు, కార్యాలయ స్వీపర్ రంగసింగ్ వెంకట్ రావులను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. వారిని హైదరాబాద్‌లోని ఏసీబీ అదనపు కోర్టులో హాజరు పరచనున్నట్లు వారు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్‌లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి మెడల్స్ సాధించారు. ఇందులో భాగంగా 27 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించారని అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ మనోజ్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ ఛైర్మన్ బస్వాపురం లక్ష్మీ నరసయ్య విజేతలను అభినందించారు.
చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం ఆమె యాసంగి పంటలకు సాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. యాసంగి పంటలకు రానున్న పది రోజులు చాలా కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ సాగు నీరు, విద్యుత్తు సరఫరా అవసరమైన అందించాలన్నారు.
KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.1983లో ఆయన శాలివాహనగ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUSఅభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.
ఇటీవల జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా నియమించిన IAS అధికారిణి భవాని సోమవారం నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె పసుపు బోర్డు జాతీయ ఛైర్మన్ పల్లె గంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కార్యక్రమంలో స్పైసెస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సుందరేశన్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.