Nizamabad

News October 27, 2024

NZB: ‘ఆర్టీసీ కార్గో సౌకర్యాన్ని వినియోగించుకోండి’ 

image

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్గో సేవా విభాగం ద్వారా ఆర్టీసీ కార్గోలో నేటి నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్‌కి సంబంధించిన 31 కౌంటర్లలో సిటీ పరిసరాల చుట్టూ వస్తువులను కస్టమర్‌కి హోం డెలివరీ అందజేయనున్నట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్గో మేనేజర్ పాల్ తెలిపారు. ఈ  అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.

News October 27, 2024

కామారెడ్డి జిల్లా వాసికి హైదరాబాదులో సత్కారం

image

భారతీయ కళా సంస్కృతి 8వ అన్యువల్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ఫీనిక్స్ అరేనాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాన్స్, ఆర్ట్స్, నృత్యం, సంగీతంలో రాష్ట్రస్థాయిలో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన దీపికకు పేరిణిలో డిస్టింక్షన్ సాధించినందుకు, మెమెంటో, చెక్‌తో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాబోయే తరాలకు తెలంగాణ పేరిణి నృత్యం నేర్పిస్తానని తెలిపారు.

News October 27, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు నిజామాబాద్ విద్యార్థులు

image

నిజామాబాద్ నగరం కాకతీయ పాఠశాలకు చెందిన సాయి అఖిల్, విఘ్నేశ్ రాష్ట్రస్థాయిలో అండర్-17 జూడో పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు దిలీప్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు పాఠశాల క్రీడకారులు ఎంపికవడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పలువురు అభినందనలు తెలిపారు. వీరు వరంగల్ జిల్లా హనుమకొండ లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

News October 27, 2024

కామారెడ్డి కలెక్టర్‌, ఎస్పీకి MLA ఫిర్యాదు

image

కామారెడ్డి పట్టణంలోని జీవీఎస్ కళాశాల ఎదురుగా ప్రధాన రహదారిపై డివైడర్‌ను కూల్చివేసిన నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు లేఖలు రాశారు. వెంటనే నిందితులను గుర్తించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు.

News October 27, 2024

నిజామాబాద్: ప్రముఖ వైద్యులు బాపురెడ్డి కన్నుమూత

image

ప్రముఖ వైద్యుడు డాక్టర్ జాల బాపురెడ్డి(75) అనారోగ్యంతో కన్నుముశారు. గత కొంతకాలంగా లివర్ సెల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న డా. బాపురెడ్డి శనివారం రాత్రి హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. ఫిజీషియన్‌గా నాలుగు దశాబ్దాలకు పైగా వైద్య సేవలందించిన బాపురెడ్డి జిల్లాలో సుపరిచితుడు. పూర్వపు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన డా.బాపురెడ్డి నిజామాబాద్ కేంద్రంగా ఎండి, ఫిజీషియన్ వైద్యులలో ప్రముఖులు.

News October 27, 2024

రేపు బిక్కనూర్ పట్టణ బంద్

image

హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సోమవారం బిక్కనూర్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చినట్లు హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు. పట్టణంలో గల అన్ని వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయాలని కోరారు. ఆటో డ్రైవర్లు సైతం బంద్‌లో పాల్గొనాలని సూచించారు. దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

News October 27, 2024

కామారెడ్డి: ఇద్దరు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

image

ఇద్దరు ఉద్యోగులకు కలెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బ్యాంకు లింకేజీ లక్ష్యసాధనకు సంబంధించి రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లా 20వ స్థానంలో ఉన్నందున అదనపు డీఆర్డీఓ బి. మురళీకృష్ణ, బ్యాంకు లింకేజీ డీపీఎం రవీందర్ రావు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

News October 27, 2024

హెచ్‌సీఎల్ అవార్డు అందుకున్న జుక్కల్ వాసి

image

భారత్ ఆర్మీలో విధులు నిర్వర్తిస్తూ విధి నిర్వహణలో భాగంగానే అనేక శిఖరాల ఎత్తుకు ఎదిగి దేశానికి అందించిన సేవలను గుర్తించిన హెచ్‌సీఎల్ అవార్డుకు జుక్కల్ వాసి ఎన్నికయ్యారు. మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామానికి చెందిన ఉమాకాంత్‌కు శనివారం బెంగళూరులోని హెచ్‌సీఎల్ ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డు అందుకోవడం పట్ల గ్రామస్థులు, జుక్కల్ మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు.

News October 27, 2024

పిట్లం: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలిలా..పిట్లం మండల కేంద్రానికి చెందిన బక్కరాములు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అయన తల్లి మృతి చెందింది. దీంతో మనస్తాపం చెంది, ఒంటరితనం భరించలేక ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలిపారు.

News October 26, 2024

ఎడపల్లి: పెద్ద చెరువులో పడి మృతి చెందిన మహిళ

image

ఎడపల్లి గ్రామానికి చెందిన అంబటి నాగమణి (56) అనే మహిళ శుక్రవారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వెళ్లి కనబడకుండా పోయింది. శనివారం ఉదయం గ్రామ చెరువులో మహిళ శవం తేలి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ శవాన్ని బయటకు తీయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.