India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి వివరాల ప్రకారం.. NZBకి చెందిన ముజీబ్ బెగ్ (26) భార్య మూడు ఏళ్ల క్రితం మృతి చెందింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ముజీబ్ జాన్కంపేట రైల్వే స్టేషన్ వద్ద రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంటర్ కాలేజ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డా.జి.బాల కిషన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.బీ.ఆర్ నేత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 25న ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ (పురుషుల) ఎంపిక ఉ.7గం.లకు, అదే విధంగా కబడ్డీ (పురుషుల) ఎంపిక పోటీలు ఈ నెల 26న ఉ.10:30గం.లకు క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలన్నారు.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అనంతగిరిలో తండ్రిని చంపిన తనయుడిని రిమాండ్‌కు తరలించినట్లు నార్త్ సీఐ సతీష్ తెలిపారు. గ్రామానికి చెందిన గౌరు అమృతం (55)ని అతని కుమారుడు మహిపాల్ ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో మెడకు టవల్ బిగించి హత్య చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు పరారీలో ఉన్న కొడుకును అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సతీష్ కుమార్ తెలిపారు.
రాష్ట్రస్థాయిలో జరిగే కబడ్డీ పోటీలకు పొతంగల్ కలాన్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు భావన, అక్షయ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి వచ్చే నెల 3వ తేదీ నుంచి 5 వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డ పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజ్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లాకు ఈ నెల 29న బీసీ కమిషన్ బృందం రానుంది. రాష్ట్రంలో చేపట్టబోయే కులగణనపై ఆయా పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారు జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటలకు బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ ఆధ్వర్యంలో సమావేశం జరుగనుందని కలెక్టర్ తెలిపారు.
తమ్ముడిని హత్య చేసిన అన్నకు బుధవారం కామారెడ్డి జిల్లా జడ్జి లాల్‌సింగ్ శ్రీనివాస్ ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించినట్లు KMR జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నస్రుల్లాబాద్ వాసి ప్రభాకర్ మద్యానికి బానిసై తమ్ముడైన శివకుమార్‌ను డబ్బులు అడిగాడు. ఆయన నిరాకరించగా కర్రతో దాడి చేసి చంపేశాడు. ఫిర్యాదు మేరకు ఎస్సై రంజిత్ కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా జిల్లా జడ్జి ఈ మేరకు శిక్ష విధించారు.
నిజామాబాద్ నగరంలోని ఓ కళాశాలలో ‘పొట్టేలు’ సినిమా యూనిట్ బుధవారం సందడి చేసింది. సినిమా ప్రమోషన్లో భాగంగా నగరానికి వచ్చిన సినీ హీరో హీరోయిన్లు అనన్య నాగళ్ల, యువచంద్ర సందడి చేశారు. కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. సినిమా విశేషాలు వివరించారు. వారితో విద్యార్థులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. కళాశాల యాజమాన్యం హీరో, హీరోయిన్‌ను సత్కరించారు.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
ఏడు నెలల క్రితం కామారెడ్డి DCRB విభాగానికి బదిలీపై వచ్చి ఈ నెల 6న IG కార్యాలయానికి సరెండర్ అయిన DSP మదన్ లాల్ ను చీటింగ్ విషయంలో సస్పెండ్ చేస్తూ DGP జితేందర్ ఉత్తర్వులు జారీచేశారు. DSP మదన్ లాల్ కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తితో తవ్వకాల్లో బంగారం దొరికిందని, రూ.6 లక్షలకే కిలో చొప్పున ఇప్పిస్తానని నమ్మించి రూ.20 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఇక్కడ విచారణ జరిపి IG కార్యాలయానికి సరెండర్ చేశారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికిచెందిన మంద వెంకటి(25) పిడుగుపాటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామ శివారులోని వడ్ల కొనుగోలు కేంద్రంవద్ద తండ్రి నాగభూషణం కొడుకుతో కలిసి పని చేస్తుండగా అకాల వర్షం రావడంతో పక్కనే ఉన్న వేపచెట్టు కింద నిల్చుని ఉండగా పిడుగు పడింది. దీంతో వెంకటి మృతి చెందగా నాగభూషణం, పక్కనే పనులు చేస్తున్న ధ్యానబోయిన కాశవ్వ, అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.