India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ GGHలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. మద్నూర్‌కు చెందిన పిట్ల రాజు, లక్ష్మి దంపతులు శుక్రవారం రాత్రి ఆస్పత్రి ఆవరణలో నిద్రించగా వారి కుమారుడు మణికంఠను ముగ్గురు మహిళలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులు మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందంతో మహారాష్ట్రకు వెళ్లి నిందితులను, బాలుడిని గుర్తించారు.
నిజామాబాద్ నగరంలోని ద్వారక నగర్ కాలనీలో ఆదివారం నగరంలోని కాంగ్రెస్ నేత కొండపాక రాజేశ్ స్వగృహంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను నుడా ఛైర్మన్ కేశ వేణు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నుడా ఛైర్మన్‌గాఎన్నికైన కేశ వేణును ప్రొఫెసర్ కోదండరాం అభినందించారు. అనంతరం బ్రాహ్మణ సంఘం సభ్యులు కేశ వేణును సన్మానించారు.
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
కుల గణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. 2, 3 నెలల్లో పంచాయతీ పోరు జరగనుండగా పల్లెల్లో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది. గతంలో ఓడినవారు, కొత్తగా పోటీ చేయాలనుకునే వారు, గతంలో గెలిచిన వారు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే మరోసారి.. ఏదైతేనేం ఎలాగైనా సర్పంచ్ కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక వార్డు మెంబర్‌గా గెలిచి ఉప సర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలని కొందరు పావులు కదుపుతున్నారు.
కామారెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా నేడు మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్, బాన్సువాడ ఇన్‌ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీ సురేశ్, తదితరులు ఈ కార్యక్రమానికి పాల్గొననున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం నిజామాబాద్ నగరంలోని ఓ హోటళ్లలో నిన్న జరిపిన దాడుల్లో కుళ్లిన మాంసపు ఉత్పత్తులను, ఫంగస్ బూజు పట్టిన కూరగాయలను గుర్తించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తామేదో తాజాగా, పరిశుభ్ర వాతావరణంలో కుక్ చేసి పెడతారని హోటళ్లకు వెళితే తమకు ఇలాంటి ఫుడ్ పెడుతున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాలు తీరు మార్చుకోవాలని పేర్కొంటున్నారు.
యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆకతాయిలను షీటీం బృందం సభ్యులు పట్టుకున్నారు. ఓ యువతి ఫోన్ కి ఇద్దరు యువకులు అసభ్యకర సందేశాలు పంపుతూ, ఫోన్ చేసి ఆమెతో అసభ్యకరంగా మాట్లాడుతూ.. ఆమెను వేదిస్తూ మానసికంగా హింసిస్తున్నారు. అయితే సదరు యువతి కుటుంబీకులు షీటీంకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆర్మూర్ షీటీం బృందం స్పందించి ఆ ఇద్దరిని పట్టుకున్నారు. అనంతరం వారిని తదుపరి చర్యలకై ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
* వెల్గటూర్ అంగన్వాడీ స్కూల్లో చేతబడి కలకలం
* NZB: జిల్లా జనరల్ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్
* ఏడ్పల్లిలో డెడ్ బాడీ కలకలం
* NZB: ఏడాదిలోపే రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత: ఈటల
* NZB ఇంచార్జ్ సీపీగా సింధు శర్మ
* CM రేవంత్ పై క్రిమినల్ కేసు బుక్ చేయాలి: వేముల
* BSWD: కొడుకును వాగులో తోసేశానన్న తండ్రి.. ఆందోళనలో తల్లి
* CM రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి: MLA ధన్పాల్
* కల్లెడి వాసికి ఓయూ నుంచి డాక్టరేట్
బాన్సువాడ మండలం దేశాయిపేటకు చెందిన రాములు తన కొడుకు పండరి (14) ను వాగులో తోసేసినట్లు భార్య గంగమణితో పేర్కొన్నాడు. కాగా ఆమె వాగు వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనపడలేదు. దీంతో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను విచారించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది. కొడుకును దాచి పెట్టాడా..? లేక నిజంగానే వాగులో పడేశాడా..? అనేది తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం వెల్గటూర్ గ్రామంలో చేతబడి కలకలం రేపింది. స్థానిక అంగన్వాడీ పాఠశాల భవనం ముందు గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గు వేసి.. అందులో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వేసి గ్రామస్థులను భయందోళనలకు గురిచేశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని, అంగన్వాడీకి పిల్లలను పంపాలంటే భయంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.