India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే అందులో చికెన్ ముక్కలు వచ్చిన షాకింగ్ ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. వినాయక్ నగర్ రెస్టారెంట్ నుంచి ఓ వ్యక్తి బావర్చీ హోటల్ పన్నీర్ బిర్యానీ పార్సిల్ ఆర్డర్ ఇవ్వగా అందులో చికెన్ ముక్కలు రావడంతో అవాక్కయ్యాడు. రెస్టారెంట్ వారికి ఫిర్యాదు చేయగా వారు సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితుడు చెప్పారు.
బాన్సువాడ అటవీ రేంజ్ పరిధిలో పని చేస్తున్న నిజాంసాగర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి (ఎఫ్ఎస్ఓ) గులాం దస్తగిరి(58) విధులు నిర్వహిస్తూ మృతి చెందారు. విధుల్లో ఉన్న ఆయన బుధవారం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే దస్తగిరిని బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ దస్తగిరి మృతి చెందారు. ఫారెస్ట్ జిల్లా డివిజన్ అధికారులు దస్తగిరి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
ఎస్సీ వర్గీకరణ కోసం నిజామాబాద్ నుండే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని MRPS వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ నమ్మక ద్రోహానికి గురైన మాదిగలు ఎంతటి త్యాగాలకైనా వెనుకాడరన్నారు. మాదిగలను మోసగించిన రేవంత్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తామని హెచ్చరించారు. వర్గీకరణ అమలుపై పాలకులే కుట్ర చేస్తున్నారన్నారు.
నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న సిద్దిరాములు ఇంట్లోకి వచ్చిన ఒక గుర్తు తెలియని వ్యక్తి మాటామాట కలిపి ఆయన మెడలోని రెండు తులాల గొలుసును లాక్కుని పారిపోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సీసీ పుటేజ్ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేశ్, టౌన్ సీఐ శ్రీనివాసరాజ్ పరిశీలించారు.
అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన CM రేవంత్ రెడ్డి దానిని అమలు చేయకుండా తొక్కి పెడుతున్నారని MRPS వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నిజామాబాద్ లో బుధవారం నిర్వహించిన MRPS, MSP అనుబంధ విభాగాల రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మాదిగలను మోసం చేసిన వారు భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.
నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయం లో 2025-26 విద్యా సంవత్సరంలో 9వ తరగతి, 11వ తరగతిలో ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 30 వరకు చివరి గడువు ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సౌండ్ బాక్స్‌ల వినియోగం పై ఉన్న నిషేధాజ్ఞలు ఉల్లంఘించి లైసెన్స్ లేకుండా సౌండ్ సిస్టంలను కిరాయికి ఇచ్చిన యజమానికి న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష విధించింది. మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామానికి చెందిన నిమ్మల వంశీ దసరా పండగ సందర్భంగా తన డిజేను అద్దెకు ఇచ్చారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు వంశీపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఒక రోజు జైలు శిక్ష విధించారు.
చాలాకాలంగా పెండింగ్లో ఉన్న NZB, అదిలాబాద్ సహా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్రమంత్రి సీతక్క తెలిపారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, తదితరులు పాల్గొన్నారు.
చాలకాలంగా పెండింగ్లో ఉన్న NZB, అదిలాబాద్ సహా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల బ్యాక్‌లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు రాష్ట్రమంత్రి సీతక్క తెలిపారు.బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీపై కసరత్తు జరుగుతోందని HYD సెక్రటేరియట్ సమావేశంలో పేర్కొన్నారు. మహిళా సంక్షేమ శాఖలో 10 మందికి అపాయింట్ మెంట్ లెటర్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కరుణ, తదితరులు పాల్గొన్నారు.
SRSP ప్రాజెక్ట్ 100 శాతం నిండిపోయి పైనుంచి అదనపు నీటిప్రవాహం ఉన్నందున బుధవారం (నేటి) ఉదయం ఎస్కేప్ గేట్లుఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేయనున్నట్లు పోచంపాడ్ డ్యాం సైట్ కార్యనిర్వాహక ఇంజినీర్ చక్రపాణి ఓ ప్రకటనలో తెలిపారు. మత్స్యకారులు, పశువుల కాపర్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరూ నదిలోకి దిగొద్దని, ప్రమాదానికి గురికావద్దని ఆయన సూచించారు.
Sorry, no posts matched your criteria.