India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాయకత్వ లోపంతోనే హైదరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. GHMC ఎన్నికల్లో 48 చోట్ల గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటుకు మాత్రమే ఎందుకు పరిమితమైందని ప్రశ్నించారు. బీజేపీలో సమన్వయ లోపం ఉందన్నారు.
మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు ఫొటో మార్ఫింగ్ కేసులో నిజామాబాద్ జిల్లా వాసి అరెస్ట్ అయ్యారు. ఎంపీ రఘునందన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ దేవన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరిని అరెస్ట్ చేశారు.
పర్యావరణాన్ని కాపాడుకొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ADEN HM బబ్లు పిలుపునిచ్చారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అమ్మ పేరిట ఒక మొక్కను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన పర్యావరణంతో కూడిన భూమిని అందించడం మనందరి బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు.
ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నయ్య (48) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వన్నెల్ (కే) గ్రామం నుంచి వస్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. చిన్నయ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనారోగ్య కారణాలతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ నరేష్ వివరాలిలా..రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి మల్లవ్వ (22) గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. వైద్యం చేయించుకున్నా ఆరోగ్యం బాగు పడటం లేదు. ఈ క్రమంలో మనస్తాపం చెంది మంగళవారం ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అత్త పద్మ ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండాకు చెందిన దేవిసింగ్ కుమార్తె రాణి అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. నేడు జరగనున్న ఉమెన్స్ యూనివర్సిటీ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు. తండాకు చెందిన రాణి అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
☞ ALL THE BEST RANI
దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా RTC అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు. కాగా బోధన్ నుంచి NZBకు ఎక్స్‌ప్రెస్ బస్సు సాధారణ సమయాల్లో రూ.50 ఉండగా.. తాజాగా రూ.70 తీసుకుంటున్నారు. అదేంటని ప్రశ్నిస్తే దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారని, అందుకే ధర పెంచినట్లు తెలిపారు. ఈ క్రమంలో కండక్టర్‌కు, ప్రయాణికుల మధ్య కాస్త వాగ్వాదం జరిగింది.
– మీ వద్ద ధరలు ఎలా ఉన్నాయి..?
కామారెడ్డి జిల్లా అడ్లూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి మంత్రాలు వేస్తున్నాడనే నెపంతో గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తిని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి, కారంపొడి చల్లి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో సాయిలు తలకు, కాళ్ల భాగాలలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో వెంకోల్ల రాజు, వెంకోల్ల లక్ష్మణ్, స్వామి, గడ్డమీది లక్ష్మణ్‌పై కేసు నమోదుచేసినట్లు దేవునిపల్లి SI రాజు తెలిపారు.
త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వివిధ కారణాలతో వాయిదా పడుతున్న మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
చందూర్ గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువలో (28 ) గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం కాలువలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి శరీరంపై బ్లాక్ కలర్ ప్యాంటు, ఎల్లో కలర్ షర్ట్ ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహన్ని మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.