India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు సత్తాచాటారు. మొత్తం 8 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా అందులో 6 గురు SGT, ఇద్దరు SA కొలువులు సాధించారు.ఉద్యోగాలు సాధించిన వారిలో గణపురం సుశీల(SGT), సదాలి నరేష్(SGT), గైని రాజు(SGT), అన్నాడి అజయ్ కుమార్(SGT), M.శ్రీశైలం(SGT), మొహ్మద్ ఖాజా(SGT), నంద అనిల్ (SA సోషల్), దేవసోత్ చందర్ రాథోడ్(SAసోషల్) ఉన్నారు.
NZB జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల గోవిందవనమాల క్షేత్రంలో శనివారం రాత్రి జరిగిన దసరా వేడుకల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ హీరో ఆశిష్ పాల్గొన్నారు. వేద పండితుల మధ్యన శమి వృక్షానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని పల్లకీ మోశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి, విజయ సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దసరా పండగ వేళ బోధన్ పట్టణంలోని గాంధీనగర్లో కత్తిపోట్ల ఘటన శనివారం కలకలం రేపింది. కాలనీకి చెందిన రేహాన్, జావిద్, బబ్లు ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అటుగా వెళ్తున్న మన్సుర్ తన గురించే వారు మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని బోధన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితులు పోలీసులు కేసు, దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు మెడల్స్ సాధించారు. మలేషియాలో నిర్వహిస్తున్న 36వ మలేషియా ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్‌లో శుభారంభం పలికారు. ఇందులో భాగంగా 35+ ఏజ్ గ్రూపులో జరిగిన లాంగ్ జంప్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన వాగ్మారే దినేష్ గోల్డ్ మెడల్, యాష్లీ గోపి సిల్వర్ మెడల్ సాధించారు. వీరు విద్యుత్ శాఖ ఉద్యోగులుగా ఉన్నారు.
బోధన్ మండలంలోని అమ్డాపూర్ గ్రామానికి చెందిన మల్లారం(55) అనే వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై మశ్చేందర్ రెడ్డి తెలిపారు. గ్రామ శివారులో గల బెల్లాల్ చెరువులోకి చేపలు పట్టడానికి వల వేసే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు వల చుట్టుకుని చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశామని అన్నారు.
నిజమాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ విష్ణుమూర్తిపై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొద్ది నెలల క్రితమే నిజామాబాద్ కు టాస్క్ ఫోర్స్ ఏసీపీగా వచ్చిన విష్ణుమూర్తి అనతి కాలంలోనే అవినీతి ముద్ర వేసుకున్నారు. ఆయన తీరు వివాదాస్పదంగా మారి ఆయనపై సెటిల్ మెంట్లు, బెదిరింపులు, మామూళ్ల వసూళ్ల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే దసరా సందడి నెలకొంది. పూలు, పండ్లు, గుమ్మడికాయలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పలు దుకాణా దారులు స్పెషల్ ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్‌లను సైతం అందిస్తున్నారు. ఆయుధ పూజ సందర్భంగా వాహనాలు, తమకు జీవనాధారమైన వ్యాపార కేంద్రాలకు పూలు అలంకరించుకొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని విద్యార్థులకు యువతకు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానిస్తున్నామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21న జరిగే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి ఆసక్తిగల వారు ముందుకు రావాలని సీపీ కల్మేశ్వర్ తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం దసరా సందడి నెలకొంది. షాపింగ్‌మాల్‌లు, పూలు, పండ్లు, గుమ్మడికాయలు దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పలు దుకాణా దారులు స్పెషల్ ఆఫర్లు, స్పాట్ గిఫ్ట్ లను సైతం అందిస్తున్నారు. ఆయుధ పూజ సందర్భంగా వాహనాలు, తమకు జీవనాధారమైన వ్యాపార కేంద్రాలకు పూలు అలంకరించుకొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.