India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ కార్పొరేషన్‌లో సగం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని, ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సీఎం మాట్లాడారు. ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారబోతున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దాన్ని బట్టే విజయావకాశాలు ఉంటాయని హితవు పలికారు. అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని వారికి వివారించారు

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం కలెక్టరేట్‌లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోసం చేసిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం రాత్రి పరిశీలించారు. అలాగే ఫెసిలిటేషన్ సెంటర్‌ను నిశితంగా తనిఖీ చేశారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో 8వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్-2026 క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. సర్పంచ్ కొత్తపల్లి హారిక మాట్లాడుతూ.. క్రీడలు ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. చదువుతో పాటు క్రీడల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్‌కు మంచి వాతావరణం ఉందని, టికెట్ వచ్చిన వాళ్లు అందరినీ కలుపుకొనిపోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లో కి తీసుకెళ్లే దాన్ని బట్టే విజయావకాశాలు ఉంటాయన్నారు.

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థులతో సీఎం రేవంత్ చిట్ చాట్ నిర్వహించారు. కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత అభ్యర్థులదేనని స్పష్టం చేశారు. మహిళా అభ్యర్థులు సగం మంది ఉండటం కలిసొచ్చే అంశం అన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు నిర్లక్ష్యం వీడి ప్రతి ఓటును కీలకంగా భావించాలన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రతిపక్షాల మాటలకు అభివృద్ధి పనులతోనే సమాధానం చెప్పాలన్నారు.

రిటైర్డ్ ఉద్యోగులు అంటే కేవలం బాధ్యతల నుంచి విరమణ పొందిన వారు కాదని, దశాబ్దాల అనుభవానికి నిలువుటద్దాలు అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో విశ్రాంత ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాలనలో కీలక పాత్ర పోషించిన వారి సంక్షేమం తమ బాధ్యత అని అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి HYD బేగంపేట విమానాశ్రయం నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌కు బయలుదేరారు. CMతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు NZB జిల్లా పర్యటనకు రానున్నారు. CM NZB జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా పాలన- ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొంటారు.

నిజామాబాద్‌లోని వినాయకనగర్‌లో ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సాత్విక్, విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ప్రచారం, TU పర్యటన రీత్యా PDSU NZB జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్‌ను ఉదయం 4 గంటలకు ఇంట్లో అరెస్ట్ చేశారు. రాజేశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన కొనసాగిస్తుందని, విద్యార్థుల కోసం ప్రశ్నించే గొంతులను నిర్బంధించటం సరైంది కాదని, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకున్నా అరెస్టు చేయటం ఏంటని వాపోయారు.

భర్త కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆర్మూర్‌కు చెందిన వివాహిత సాగరిక గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అధనంగా రూ.20 లక్షలు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు వేధించడంతో తీవ్ర మనోవేధనకు గురై ఉరేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తమ్ముడు సాయి కృష్ణ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.