India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిజామాబాద్ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో దానిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నుంచి 19వ డివిజన్లో పోటీ చేస్తున్న కాటిపల్లి శమంత, బీజేపీ నుండి 6వ వార్డులో పోటీ చేస్తున్న గోపిడి స్రవంతి రెడ్డి మేయర్ పదవీని ఆశిస్తున్నట్లు సమాచారం.

జక్రాన్‌పల్లి మండలంలో విద్యుత్ షాక్‌కు గురై వంశీకృష్ణ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. SI మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్‌కు చెందిన వంశీకృష్ణ బైక్ పై మాక్లూర్‌లోని ముత్యంపల్లెలో గల తన భార్య వద్దకు వెళుతున్నాడు. మార్గమధ్యలో రాత్రి దారి తప్పిపోయి సికింద్రాపూర్ రంగనాయక గుట్ట వద్ద తిరుగుతుండగా జొన్న తోటకు అడవి పందుల కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ తీగల తగిలి మృతి చెందాడు.

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలను మరోమారు క్షేత్రస్థాయిలో సరి చూసుకోవాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు, లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.

హిందూ వ్యతిరేకులు కనుకనే తాను కాంగ్రెస్‌లోకి రాలేదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోనియాగాంధీ తమ కుటుంబానికి ఎంతో దగ్గర అయినప్పటికీ తాను ఆ పార్టీ హిందూ వ్యతిరేకం కనుకనే కాంగ్రెస్‌లో చేరలేదన్నారు. తన తండ్రిని అవమానపరిచి కాంగ్రెస్ నుంచి బయటకు పంపారన్నారు. తన కార్లపై, ఇంటిపై దాడులు చేశారని మండి పడ్డారు.

ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. అభ్యర్థుల నామినేషన్లు, పరిశీలనలు ఉపసంహరణలు పూర్తయ్యాయి. బీఫామ్ లు పార్టీలు అందించడంతో ఇక అభ్య ర్థుల లెక్క కూడా తేలిపోయింది. ఒక్కో పార్టీ నుంచి ఒక్కోవార్డులో ఇద్దరికి మించి నామినేషన్లు వేశారు. అధిష్టానాల నిర్ణయం మేరకు బీ ఫామ్లు అందడంతో ప్రధాన ఘట్టం ప్రచారం మొదలైంది.

ఆర్మూర్, భీంగల్, బోధన్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 153 మంది, బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డులకు 162 మంది, భీమ్‌గల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు 49 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ గడువు మంగళవారం సాయంత్రంతో ముగియగా 60 వార్డులకు గాను 350 మంది పోరు బరిలో నిలిచారు. ఇందులో BJP నుంచి 52 , కాంగ్రెస్ నుంచి 62, BRS నుంచి 59, AIMIM నుంచి 25, AIFB నుంచి 15, BSP నుంచి 3, JSP నుంచి 11, AAP నుంచి 1, CPM నుంచి 3, CPI నుంచి 2, ఇతర రిజిస్టర్డ్ పార్టీలు 17మంది , స్వతంత్ర అభ్యర్థులు 100 మంది బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ అంకిత్, ఎన్నికల పరిశీలకులు సీహెచ్. సత్యనారాయణ రెడ్డి సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు.
హ్యాండ్ బుక్‌లో పొందుపర్చిన అంశాలను క్షుణ్ణంగా చదివి పోలింగ్ విధులపై స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 6న నిజామాబాద్ జిల్లా పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, పొలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య జిల్లా అధికారులతో కలిసి మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. NZB బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని CM సభా స్థలిగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, CP క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ మంగళవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 21 మందికి ఒక్కొక్కరికి రూ .10 వేల చొప్పున రూ.2.10 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.