India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్‌బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉన్నాయన్నారు.

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం గోదావరి పుష్కరాలు-2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్‌బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద 15 పుష్కర ఘాట్లు ఉన్నాయన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ కోసం బర్దీపూర్ సభాస్థలం, స్టేజ్, హెలిప్యాడ్, ప్రవేశ మార్గాలను నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పరిశీలించారు. భద్రతా లోపాలు రాకుండా ట్రాఫిక్, పాదచారుల సౌకర్యాలు, అత్యవసర వాహన మార్గాలు, అంబులెన్స్, ఫైర్ సర్వీస్ ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులకు దిశానిర్దేశం ఇచ్చారు. 1,200 మంది పోలీస్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేశారు.

జాతీయ వైరల్ హెపటైటిస్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బందికి హెపటైటిస్-బీ టీకాల కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ, జిల్లా టీకాల అధికారి డా.అశోక్ గురువారం ముదక్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా గుర్తించిన 739 మంది సిబ్బందిలో 647 మందికి తొలి మోతాదు అందించారు. రెండో మోతాదు 28 రోజుల తర్వాత, మూడో మోతాదు ఆరు నెలల తర్వాత ఇవ్వనున్నట్లు తెలిపారు.

అఖిల భారత టీచర్స్ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో వద్ద నిర్వహించిన ధర్నాలో NZB స్టేట్ టీచర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. CPSను రద్దు చేసి OPS పునరుద్దరణ చేయాలని కోరారు. 2010 ముందుగా నియామకమైన టీచర్స్‌ను TET నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తొలగించాలని డిమాండ్ చేశారు. NZB అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను ఎన్నికల పరిశీలకుడు సీహెచ్ సత్యనారాయణ రెడ్డి గురువారం పరిశీలించారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 10 పోలింగ్ కేంద్రాలను, గౌతమ్ నగర్ ఉర్దూ మీడియం స్కూల్‌లోని రెండు పోలింగ్ కేంద్రాలను, ఎస్ఎఫ్ఎస్ స్కూల్లోని 9 కేంద్రాలను, కాకతీయలోని ఏడు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.

మాక్లూర్, నందిపేట్ వైపు నుంచి సభకు వచ్చే వాహనాలు దాస్ నగర్, మాణిక్ బండార్ చెక్క నుంచి అమ్రాద్ , ఓడ్డేటిపల్లి, కేశపూర్ మీదుగా త్రిమూర్తి COLD STORAGE సమీపంలోని పార్కింగ్ ప్రాంతాలకు చేరుకోవాని CP సాయి చైతన్య తెలిపారు. బోధన్ వైపు నుంచి వచ్చే వాహనాలు అర్సపల్లి జంక్షన్-అర్సపల్లి రైల్వే గేట్, కలెక్టరేట్, కంఠేశ్వర్, మాధవ నగర్ బైపాస్, కేశపూర్ కమాన్ మీదుగా చేరుకోవాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్, జక్రాన్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, డిచ్‌పల్లి నుంచి సభకు వచ్చే వాహనాలు NH-44 రోడ్డు వెంబడి డిచ్‌పల్లి, ధర్మారం, నడిపల్లి, ఎంఎన్‌ఆర్ గెస్ట్ హౌస్ వద్ద U టర్న్ తీసుకోవాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న నారాయణ కాలేజ్ పార్కింగ్ వద్దకు చేరుకోవాలని CP సాయి చైతన్య సూచించారు.

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని NZB జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి సూచించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విధుల్లో నిమగ్నం అయిన ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఐడీఓసీ(కలెక్టరేట్), మున్సిపల్ కార్యాలయాల్లో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థి ఎంపికలో ఎక్స్ అఫీషియో సభ్యులే నిర్ణయాత్మకం కానున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ నుంచి ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్యలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, భోధన్ ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డిలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు
Sorry, no posts matched your criteria.