India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లాలో బుధవారం విషాద ఘటన జరిగింది. వివరాలు.. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన మమతకు మోషంపూర్ వాసితో పెళ్లైంది. వారిమధ్య మనస్పర్థలు రాగా పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది ఈ నెల 7న ఆత్మహత్యాయత్నం చేసింది. బాధతో ఆమె చెల్లి ప్రత్యూష సైతం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రత్యూష చనిపోయింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన శేఖ్ గౌస్ ఓ వైపు వ్యవసాయం చేస్తూనే బయోసైన్స్‌లో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోయినా అధైర్యపడలేదు. వ్యవసాయం చేస్తూనే ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని చూసుకున్నాడు. చివరికి ప్రభుత్వ కొలువు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దీంతో మద్నూర్ గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB డైరెక్టర్‌గా నియమితులైన బీర్కూర్ మండలం దామరంచ సొసైటీ ఛైర్మన్ కమలాకర్ రెడ్డిని పలువురు బుధవారం రాత్రి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, పోగు పాండు, ఓంకార్, ఈరాజ్ సాయిలు, నర్ర సాయిలు, సమద్, సతీష్, పిర్గొండ సతీష్, రాజు, బాన్సువాడ నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్‌ఛార్జి బోయిడి లక్ష్మణ్ ముదిరాజ్ ఉన్నారు.
సద్దుల బతుకమ్మను ప్రతి ఒక్కరూ రేపు నిర్వహించుకోవాలని నిజామాబాద్ పురోహితులు బ్రహ్మశ్రీ జ్యోషి మధుసూదన శర్మ తెలిపారు. ఏటా సద్దుల బతుకమ్మ జరుపుకునే వారని, ఈ సంవత్సరం ఒకరోజు ఎడ రావడంతో దసరా పండుగ శనివారం వస్తుందన్నారు. ప్రజలంతా 12వ తేదీననే దసరా నిర్వహించుకోవాలని తెలిపారు.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే నిజామాబాద్ నగరంలో తూ తూ మంత్రంగా కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ఉదాహరణగా 3వ డివిజన్ పరిధిలోని గంగస్థాన్ ఫేజ్-2లో నిన్న జరిగిన సర్వే సందర్భంగా నవీపేట్ ప్రాంతానికి చెందిన సర్వే బృందం సభ్యులు తామున్న చోటుకే సర్వే కోసం రావాలన్నారని తెలిపారు. ముఖ్యంగా అపార్టుమెంట్లలో వృద్ధులను కిందికి వచ్చి సర్వేలో కిందకు రావాలని చెప్పి వారు వెళ్లిపోయారన్నారు.
భీంగల్ పట్టణంలో అతివేగంగా వెళుతున్న టాటా ఏస్ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం భీంగల్ నుంచి సిరికొండకు వెళ్తున్న టాటా ఏస్ వాహనం డ్రైవర్ అఫ్రోజ్ భీంగల్ పట్టణంలో నంది నగర్ వద్ద రోడ్డు దాటుతున్న తోపారపు నిశ్వంత్(7)ను ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాలుడిని ఆర్మూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
దసరా పండుగ సందర్భంగా తమ ఊర్లకు వెళ్లే వారికి NZB సీపీ కల్మేశ్వర్ పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. పక్కింటి వారి ద్వారా ఇంటికి సంభందించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. కాలనీల వారీగా గస్తీ దళాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. తమ తమ గ్రామాలకు వెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌లలో సమాచారం అందించాలని పేర్కొన్నారు.
HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలియజేశారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.
లింగంపేట మండలంలోని బోనాలు తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన రిషికేష్ (6) మంగళవారం ఇంటి సమీపంలో ఉన్న ఆగి ఉన్న ట్రాక్టర్ పై ఎక్కి ఆడుకుంటూ గేర్లను డౌన్ చేశాడు. దీంతో ట్రాక్టర్ గుంతలో బోల్తా పడి బాలుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ మృతి చెందినట్లుగా గ్రామస్థులు తెలిపారు. కాగా ప్రమాదవశాత్తు మృతి చెందాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Sorry, no posts matched your criteria.