Nizamabad

News October 1, 2024

ప్రమాదవశాత్తు పోచారం కెనాల్‌లో పడి యువకుడి మృతి

image

నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామానికి చెందిన గోరుకుల లక్ష్మణ్ (23) ప్రమాదవశాత్తు పోచారం ప్రధాన కాలువలో కాలుజారి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం లక్ష్మణ్ పోచారం ప్రధాన కాలువలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కాగా సోమవారం సాయంత్రం పోచారం ప్రధాన కాల్వలోశవమై కనిపించినట్లు ఎస్ఐ తెలిపారు.

News October 1, 2024

నిజామాబాద్ జిల్లా పీఈటీ టాపర్‌గా రాకేశ్ రెడ్డి

image

సోమవారం వెలువడిన డీఎస్సీ పరీక్ష ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన ఏరా రాకేశ్ రెడ్డి జిల్లాలో పీఈటీ లో 61.50 మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. దీంతో అతనిని తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు, యువకులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జిల్లా మొదటి ర్యాంకు సంపాదించడంతో గ్రామస్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News October 1, 2024

నీట్ పరీక్షల్లో కామారెడ్డి విద్యార్థుల ప్రతిభ

image

ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో కామారెడ్డి పట్టణానికి చెందిన చెప్యాల సునైనరెడ్డి రాష్ట్ర స్థాయిలో 272వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. అలాగే మరొక విద్యార్థిని సంజన రాష్ట్ర స్థాయిలో 4,148వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, పలువురు అభినందించారు.

News October 1, 2024

అక్టోబర్ 8-10 వరకు కామారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

image

కామారెడ్డి జిల్లాలో అక్టోబర్ 8 నుంచి 10 వరకు జల శక్తి అభియాన్ కేంద్ర బృందం పర్యటిస్తుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంచే పనులను అధికారులు పూర్తి చేసి నివేదికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News September 30, 2024

కామారెడ్డి జిల్లా టాపర్‌గా పిట్లం యువతి

image

సోమవారం వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని మార్దండ గ్రామానికి చెందిన కోటగిరి మౌనిక జిల్లాలో మొదటి స్థానం సాధించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ జిల్లా మొదటి స్థానం సంపాదించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News September 30, 2024

NZB: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతి కావడంతో అటు మాంసాహారం, మందు బంద్ ఉండడంతో పెత్తర అమావాస్య ఎలా జరుపుకోవాలని నిజామాబాద్, కామారెడ్డి జిల్లావాసులు ఆలోచనలో పడ్డారు. పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని సూచిస్తున్నారు.

News September 30, 2024

నిజామాబాద్‌లో 8,30,580 ఓటర్లు ఉన్నారు..!

image

నిజామాబాద్ జిల్లాలో 27 మండలాలు ఉండగా 545 గ్రామపంచాయతీలో 5022 వార్డులు ఉన్నాయి. జిల్లా మొత్తంలో 8,30,580 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఇందులో 4,43,548 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 3,87,017 మంది పురుషులు, 15 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో పంచాయతీ ఎన్నికల్లో వారు కీలకంగా మారనున్నారు.

News September 30, 2024

నిజామాబాద్: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!

image

DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
కామారెడ్డి 3560 272 1:13
నిజామాబాద్ 3204 285 1:11

News September 30, 2024

రేపు కామారెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

image

కామారెడ్డి: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1వ తేదీ మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పారు. స్థానిక కొత్త బస్టాండ్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం పట్టణంలోని తిలక్ రోడ్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నా తర్వత రాజారెడ్డి గార్డెన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారన్నారు.

News September 30, 2024

NZB: మంత్రి జూపల్లి రాక

image

మంత్రి జూపల్లి ఇవాళ జిల్లాకు రానున్నారు. ఉదయం 10 గంటలకు మోర్తాడ్, 11 గంటలకు భీంగల్, ఆ తర్వాత ఆర్మూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ భవనాలను ప్రారంభిస్తారని అధికారులు, నాయకులు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నిజామాబాద్‌లోని IDOC సమీక్షా సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.