Nizamabad

News June 25, 2024

కామారెడ్డి: అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఉపాధ్యాయులుగా పని చేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ నారా గౌడ్ తెలిపారు. పాఠశాలలో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఆర్ట్స్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈనెల 29 లోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

News June 25, 2024

నిజామాబాద్‌లో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె

image

నిజామాబాద్‌లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. రెండో రోజు మంగళవారం జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.

News June 25, 2024

కామారెడ్డిలో టమాట@ రూ.100

image

కామారెడ్డిలో రోజురోజుకి కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాట ధర రూ.100, పచ్చిమిర్చి రూ.120, కొత్తిమీరు రూ.150, పాలకూర రూ.80 బీరకాయలు రూ.120, క్యాప్సికం రూ.120 క్యాబేజి రూ.80 పలుకుతుంది. దీంతో సామాన్య ప్రజలు కూరగాయలు కొనలేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో కూరగాయల ఉత్పత్తి పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News June 25, 2024

బోధన్: రద్దు చేసిన రైళ్లను వెంటనే పునరుద్ధరించాలని వినతి

image

రద్దు చేసిన బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజర్ రైల్, బోధన్ కరీంనగర్ రైళ్లను వెంటనే పునరుద్ధరించాలని విద్యార్థి జేఏసీ బోధన్ స్టేషన్ మాస్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిజామాబాద్ నుంచి నడిచే నిజామాబాద్ కాచిగూడ ప్యాసింజర్ రైలు బోధన్ నుంచి ప్రారంభించాలని, బోధన్ నుంచి ప్రారంభమయ్యే రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌కు బోధన్ స్టేషన్లో టికెట్టు ఇవ్వాలని కోరారు.

News June 24, 2024

NZB: రైల్వేట్రాక్.. ఆత్మహత్యలకు అడ్డా

image

నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రోజురోజుకి ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి, బాసర స్టేషన్లు వస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 20 వరకు 54 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 52 మంది పురుషులైతే.. ఇద్దరు మహిళలు ఉన్నారు. రైల్వే అధికారులు గ్రామాల సమీపంలో కొన్ని కి.మీ పరిధిలో పర్యవేక్షణ పెడితే చాలా వరకు బలవన్మరణాలను నివారించవచ్చు.

News June 24, 2024

కడుపునొప్పి భరించలేక యువకుడి సూసైడ్

image

కడుపునొప్పి భరించలేక యువకుడు ఇంట్లో ఉరేసుకుని మృతిచెందిన ఘటన నిజాంసాగర్ మండలంలోని తుంకీపల్లిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి జ్ఞానేశ్వర్ (24) ఆటో డ్రైవర్ సోమవారం కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News June 24, 2024

షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కలిశారు. నియోజకవర్గంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివెళ్లారు. ఆయన్ను కలిసి రాజకీయ పరిస్థితులు వివరించారు. పార్టీ కోసం పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో తాము పనిచేస్తామని తెలిపారు.

News June 24, 2024

NZB: ‘జూ.డా సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు’

image

తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు వెళుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నిజామాబాద్ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.నాగమోహన్ తెలిపారు. GGHలో రోగులకు వైద్య సేవల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అందరి వైద్యుల సెలవులు రద్దు చేశామని, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు విధులు నిర్వహిస్తారని వివరించారు.

News June 24, 2024

బాన్సువాడ: గొడ్డలితో నరికి.. సెప్టిక్ ట్యాంకులో పడేశారు

image

మామతో కలిసి ఓ మహిళ <<13495824>>భర్తను హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. CI కృష్ణ వివరాల ప్రకారం.. తిర్మలాపూర్‌కు చెందిన రాములు(40) తాగివచ్చి భార్య మంజుల, తండ్రి నారాయణతో గొడవపడేవాడు. అది భరించలేక రాములును వారిద్దరూ కలిసి ఈనెల 9న గొడ్డలితో నరికి హత్య చేసి శవాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. రెండు రోజుల తర్వాత ఇంటి ఎదుట గొయ్యి తీసిపూడ్చిపెట్టారు. అతడి బావ అయిన శ్రీనివాస్‌ వారి కుటుంబీకులను అడగడంతో విషయం బయటపడింది.

News June 24, 2024

కామారెడ్డి: నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

image

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదల చేయనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి షేక్ సలాం తెలిపారు. ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 7658కి 2666, రెండో సంవత్సరంలో 7234కి 3204 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో జిల్లాకు 35వ స్థానం దక్కింది. కాగా మొదటి సం.లో 6236, రెండో సం.లో 4275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.