India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్ణీత గడువులోగా CMR బియ్యం ప్రభుత్వానికి అప్పగించని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సివిల్ సప్లై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ నెల 30లోగా బియ్యం సప్లై చేయకపోతే మిల్లర్లకు అపరాధ రుసుం విధించటంతో పాటు, ఈ వానాకాలం సీజన్‌కు వడ్లు కేటాయించమన్నారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా ఈ నెల 30న ఆర్చరీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ నిర్వహణ కార్యదర్శి నాగమణి తెలిపారు. ఈ ఎంపికలు నిజామాబాద్‌లోని నాగారంలో గల రాజారాం స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని పాఠశాలల్లో చదువుతున్న అండర్ 14, 17 బాల బాలికలు తమ బోనఫైడ్, సర్టిఫికెట్స్ తీసుకొని హాజరుకావాలన్నారు.
తన కూతురిని హత్య చేశాడన్న అనుమానంతో మామను.. వియ్యంకుడు హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్‌లో జరిగింది. కంజర్‌కు చెందిన సత్యనారాయణ తన కూతురిని అదే గ్రామానికి చెందిన నరహరి కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇటీవల సత్యనారాయణ కూతురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందగా తన కూతురుని నరహరే హత్య చేశాడని కోపం పెంచుకున్న సత్యనారాయణ రాత్రి నరహరిని కట్టెలతో కొట్టి హతమార్చాడు.
నిజామాబాద్ నగర నడిబొడ్డున సరస్వతినగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జూదం ఆడుతున్న ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ. 15 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం జూదం అడ్డాపై పోలీసులు దాడి చేశారు. అక్కడ జూదం ఆడుతున్న వారిని చూసి ఖంగుతిన్నారు. అనంతరం వారిని అరెస్టు చేశారు.
నిజాంసాగర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో నర్సింగ్ రావ్ పల్లి చౌరస్తా – నిజాంసాగర్ రహదారిపై గల సైలాని బాబా దర్గాకు సమీపంలో చిరుత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లినట్లు వాహనదారులు తెలిపారు. అచ్చంపేట్ మోడల్ స్కూల్, మాగి ఫ్యాక్టరీ ప్రాంతాల్లో గతంలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లో 1 సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకొని నిజామాబాద్ జిల్లాలో బుధవారం రిపోర్టు చేసిన ట్రైనీ ఎస్సైలు పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు ట్రైనీ ఎస్సైలు శ్రీనివాస్, రాజేశ్వర్, కిరణ్ పాల్, శైలెందర్, సుస్మిత, రమ, సుహాసిని, కళ్యాణిను ఆయన అభినందించారు. ఆయనతో పాటు అదనపు డీసీపీ కోటేశ్వరావు, తదితరులు ఉన్నారు.
పిట్లంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బుధవారం పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పిట్లం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఇదే సమయంలో అక్కడే అన్న వాలీబాయి అనే వృద్ధురాలు సబ్ కలెక్టర్‌తో ఆమె ఆవేదనను వ్యక్తం చేసింది. తనకు ఎలాంటి ఆధారం లేదని, కనీసం పింఛన్ ఐనా ఇప్పించండి మేడం అని తన బాధను వెల్లబుచ్చింది. స్పందించిన సబ్ కలెక్టర్ ఆమెకు పించన్ ఇప్పించాలని ఎంపీడీవోకు ఆదేశించారు.
ప్రేమించిన యువతి నిరాకరించిందని యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి చెందిన 21 ఏళ్ల యువకుడు ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 10న పురుగుల మందు తగగా NZBలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
నవీపేట, సాలూరా మండలాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు మత్స్యకారులు నీటిలో మునిగి మృతి చెందారు. నవీపేట మండల మహంతానికి చెందిన భూమన్న స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లగా కాళ్లకు వల చుట్టుకుని చనిపోయాడు. సాలూర మండలం హున్నాకు చెందిన సాయిలు మందర్న శివారులోని రాంసాలకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లి వలకు చుట్టుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కామరెడ్డి జిల్లాలోని పలు మండలాలకు నూతన ఎంఈఓలను విద్యాశాఖ మంగళవారం నియమించింది. మాచారెడ్డి-దేవేందర్ రావు, లింగంపేట్-షౌకత్, బీర్కూర్-వెంకన్న, జుక్కల్-తిరుపతయ్య, రాజంపేట్-పూర్ణ చందర్, రామారెడ్డి-ఆనందరావు, నిజాంసాగర్-తిరుపతి రెడ్డి, నాగిరెడ్డిపేట్-భాస్కర్ రెడ్డి, నస్రుల్లాబాద్-చందర్, బిబిపేట్-అశోక్, దోమకొండ-విజయ్ కుమార్, పాల్వంచ-జేతాలాల్, గాంధారి-శ్రీహరిని నియమించినట్లు ఉత్తర్వులు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.