India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫిలిప్పీన్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేల్పూర్ మండలానికి చెందిన అక్షయ్ మృతి చెందాడు. అక్షయ్ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మరో ఐదు నెలలో ఎంబీబీఎస్ కావస్తున్న సమయంలో అక్షయ్ ఆకస్మిక మృతి అతని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల్లో జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. నిజామాబాద్‌లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, కామారెడ్డిలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశడ్డి, ఆదిలాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జెండాను ఎగురవేయనున్నారు.
మోపాల్ మండలంలోని ముదక్పల్లి PHCలో ఆయూష్ వైద్యురాలికి, సిబ్బందికి DM&HO రాజశ్రీ మెమోలు జారీ చేశారు. ఇటీవల PHCని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేసిన సమయంలో వారు విధులకు గైర్హాజరు అయ్యారు. విధులకు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వారికి కలెక్టర్ నోటీసులిచ్చారు. కాగా PHC ఇన్‌ఛార్జ్ డ్రాయింగ్ ఆఫీసర్‌గా డిప్యూటీ DM&HO అంజనకు బాధ్యతలు అప్పగించారు.
గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు మల్టీ జోన్-1 IGP చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వినాయకుల ఊరేగింపులో ఆకతాయిలను, జేబు దొంగలను నియంత్రించడానికి క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, షీ టీమ్‌లను మఫ్టీలో, పోలీసు భద్రత సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
నిజామాబాద్‌లోని మంచిప్ప గ్రామలో ఇద్దరు స్నేహితులు వినూత్నంగా ఆలోచించారు. గ్రామానికి చెందిన గంగాధర్, విలాస్ తమ గల్లీ వినాయకుడిని నిమజ్జనానికి ఎడ్ల బండిపై తరలించారు. ఎడ్లకు బదులుగా వారే తమ భుజాలతో బండిని లాగుతూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. వాహనాలకు బదులుగా స్వామివారిని తమ భూజాలపై మోసుకెళ్లి నిమజ్జనం చేయడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.
గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని నూతన TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌లో 1985లో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా తన ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు. కౌశిక్‌రెడ్డి వాడిన భాష వల్లే అరెకపూడి గాంధీ అనుచరులు నొచ్చుకున్నారని, బూతులు తిట్టుకోవడం TG రాజకీయాల్లో గతంలో లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని తనకు పదవితో నిరూపితమైందని వెల్లడించారు.
నిజామాబాద్ నగరంలోని బాబన్ సాహబ్ పహాడ్ లో తాళం వేసి ఇంట్లో చోరీ జరిగింది. బాబన్ సాహబ్ పహాడ్‌కుచెందిన షేక్ అబ్బుత్ ఆలిక్ శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న ఉన్న 2 తులాల బంగారం, 50 వేల రూపాయల నగదు అపహరించుకుపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు 5వ టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు.
రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ నవయుగ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకునికి భక్తులు ఆదివారం 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. లడ్డూలు, గారెలు, చెకోడీలు, అరిసెలు, బొబ్బట్లు, పండ్లు ,పాయసం, పులిహోర, స్వీట్లు ఇతర రకాల నైవేద్యాలను భక్తులు తయారుచేసి గణనాథునికి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం కుంకుమార్చన నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పాత జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ దంపతులు శనివారం రాత్రి పట్టణంలోని వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని దయతో వర్షాలు సమృద్ధిగా కురిశాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారిని వినాయక మండప నిర్వాహకులు సన్మానించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మకాలను బంద్ చేయాలని పోలీస్ కమిషనర్ సీపీ కల్మేశ్వర్ ఆదేశాలు జారీచేశారు. అలాగే బార్లు, క్లబ్లు మూసేయాలన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.