India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర బడ్జెట్‌ను వ్యతిరేకిస్తూ ఈ నెల 10న హైదరాబాద్‌లో తలపెట్టిన ప్రజా సంఘాల మహాధర్నాను జయప్రదం చేయాలని CITU నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. శనివారం వారు మాట్లాడుతూ HYDలో ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిచనున్నట్లు చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్ మార్కెట్లో కొన్ని రోజులుగా పసుపు కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ధర మాత్రం గతేడాది కంటే తక్కువ ఉందని రైతులు చెబుతున్నారు. గత సీజన్లో మొదట 13 వేలకు క్వింటాలు ఉండగా ప్రస్తుత సీజన్లో అది 11 వేలకు పడిపోయింది. తెగుళ్లు సోకి పంట దిగుబడి తగ్గడం మరో వైపు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి బస్టాండ్‌లో శనివారం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు <<15397229>>విద్యుత్ స్తంభాన్ని<<>> ఢీకొట్టిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మాచారెడ్డి బస్టాండ్‌లో గతంలో విరిగి, ఎలాంటి కరెంట్ కనెక్షన్ లేని స్తంభాన్ని తాకిందని, ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారన్నారు.
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
KMRజిల్లాలో ఈరోజు భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు.. KMRడిపోకు చెందిన RTCబస్సు భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యలో మాచారెడ్డి బస్టాండ్ వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అది వైర్లతో సహా రోడ్డుపై పడింది. ప్రయాణికులు భయపడి బస్సు దిగి పరుగులు తీశారు. వైర్లు ఏ మాత్రం బస్సుపై పడినా భారీ ప్రమాదం జరిగి ఉండేది. వెంటనే కరెంట్ కట్ అవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి శనివారం తెలిపారు. KM No 467-7 నుంచి 467- 8 మధ్య అకోలా నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించామన్నారు. మృతుడి గురించి సమాచారం తెలిస్తే 8712658591 నంబర్‌కు తెలపాలని SI సాయిరెడ్డి కోరారు.
వాహనదారులకు నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు పలు సూచనలు చేశారు. ఇటీవల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
> పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దు.
> వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉండాల్సిందే.
> బైకర్లు ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు.
> హెల్మెట్ లేకుండా బైక్ నడపొద్దు.
> అతివేగంగా వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు..
> నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు SHARE IT
కామారెడ్డి పెద్ద చెరువులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీకి చెందిన చిన్నచెవ్వ రాములు, అతడి చిన్నకొడుకు సాయికుమార్ (24)తో కలిసి శుక్రవారం సాయంత్రం పెద్ద చెరువుకు వెళ్లారు. స్నానం చేసేందుకు సాయికుమార్ చెరువులోకి దిగగా, లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక మునిగిపోయాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేవునిపల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అనుబంధ సంస్థగా పోలీసు శాఖ పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి జాతకాలు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను అధికారులు, పోలీసులు వేధిస్తున్నారన్నారు.
పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ BJP గెలవాలని కామారెడ్డి MLA వెంకటరమణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల BJP గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెడీగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
Sorry, no posts matched your criteria.