Nizamabad

News May 31, 2024

NZB: పురుగుల మందు సేవించి మహిళ ఆత్మహత్య

image

కొడుకుతో చిన్న పాటి గొడవ కారణంగా తల్లి పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. NZB నాగారంలో లక్ష్మీ అనే మహిళ, కొడుకు చెప్పిన మాట వినకపోవడంతో రెండు రోజుల క్రితం గొడవపడింది. దీంతో మనస్తాపానికి చెందిన లక్ష్మి, ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఐదవ టౌన్ ఎస్ఐ అశోక్ తెలిపారు.

News May 31, 2024

నాగిరెడ్డిపేట్ ఇన్‌ఛార్జ్ ఎంపీపీగా వినీత దుర్గారెడ్డి

image

నాగిరెడ్డిపేట మండల ఇన్‌ఛార్జ్ ఎంపీపీగా టేకులపల్లి వినీత దుర్గారెడ్డి శుక్రవారం ఎంపీడీవో పర్బన్న సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఎంపీపీనీ శాలువాతో ఘనంగా సన్మానించి ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ధారబోయిన కృష్ణ, గుర్రాల సిద్దయ్య, లక్ష్మయ్య ఉన్నారు

News May 31, 2024

కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా వనిత

image

కామారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా వనిత ఎన్నికైనట్లు ఆర్‌డీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా తనను ఎన్నుకున్నందుకు కౌన్సిలర్లకు, ప్రభుత్వ సలహదారుడు షబ్బీర్ అలీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

News May 31, 2024

తిరుపతిలో గుండెపోటుతో మద్నూర్ వాసి మృతి

image

మద్నూర్ కు చెందిన యువకుడు చౌడేకర్ రూపమ్ (31) గుండె పోటుతో తిరుపతిలో గురువారం రాత్రి మృతి చెందాడు. స్నేహితులతో కలిసి తిరుపతి వెళ్లిన రూపమ్ తిరుమల దర్శనం చేసుకుని గోవిందరాజ స్వామి దర్శనం కోసం క్యూలో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతడి స్నేహితులు తెలిపారు. కాగా మూడు నెలల క్రితం రూపమ్‌కు వివాహం అయింది.

News May 31, 2024

UPDATE.. NZB: చిన్నారిని హత్య చేసిన తండ్రి

image

నాలుగేళ్ల చిన్నారిని సవితి తండ్రి హత్య చేసిన విషయం తెలిసిందే. మాక్లూర్‌లోని ధర్మోరాకు చెందిన అరుణ్‌కు మొదటి భార్యతో విడాకులు కాగా NZBకి చెందిన సునీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే లక్కీ(4) అనే కూతురు ఉంది. పెళ్లికి ముందు పాప తమతోనే ఉంటుందని ఒప్పుకొని తర్వాత పాపను మీ అమ్మగారింట్లో ఉంచు అంటూ గొడవపడేవాడు. పాప తన ఇంట్లో ఉండటం నచ్చని అరుణ్ ఇంట్లో నిద్రిస్తున్న పాపను గొంతునులిమి చంపేశాడు.

News May 31, 2024

నిజామాబాద్ సివిల్ సప్లై DSO, DM సస్పెన్షన్

image

నిజామాబాద్ సివిల్ సప్లై DSO చంద్ర ప్రకాశ్, DM జగదీశ్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు పౌరసరఫరాల MD DSచౌహాన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రధానంగా ఏడు రైస్ మిల్లులకు సంబంధించి CMR కేటాయింపులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, DSO పూర్తి సహకారంతోనే ఈ అక్రమాలు జరిగినట్లు తేల్చారు. విచారణ నివేదిక అనంతరం ఇద్దరు అధికారులపై ఏకకాలంలో సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువరించారు.

News May 31, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: NZB కలెక్టర్

image

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జూన్ 9వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు జూన్ 1వ తేదీ నుండి పరీక్ష ప్రారంభమయ్యే వరకు కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in
ద్వారా హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన అభ్యర్థులకు సూచించారు.

News May 30, 2024

మాక్లూర్: నాలుగేళ్ల చిన్నారిని హత్య చేసిన తండ్రి

image

మాక్లూర్ మండలం ధర్మోరాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని సవితి తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సునీత అనే మహిళ అరుణ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కాగా మెుదటి భర్తకు పుట్టిన పాప ఉండొద్దని సునీతతో అరుణ్ తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే చిన్నారి లక్కి(4) నిద్రలో ఉండగా గొంతు నులిమి హత్య చేశాడు. అరుణ్, కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News May 30, 2024

బాన్సువాడ: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

ఇంట్లో విద్యుత్ ఎక్స్‌టెన్షన్ బాక్స్ మరమ్మత్తులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన శ్రీనివాస చారి(45), నీరజ దంపతులు ఉపాధి కోసం సూరారంలోని విశ్వకర్మ కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడి భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

బడుల పునః ప్రారంభానికి ముందే పనులన్నీ పూర్తి కావాలి: కలెక్టర్

image

నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికే ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి పనులను నిశితంగా పరిశీలన జరిపారు.