India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన SRH VS CSK ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ని 35,992 మంది వీక్షించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. గ్రౌండ్ ఫుల్ కెపాసిటీతో నిండిపోయిందని HCA తెలిపారు. హోమ్ గ్రౌండ్లో రెండో మ్యాచ్ గెలవడం పట్ల హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, బృందం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి శుక్రవారం వరకు 361మందిపై 287 కేసులు నమోదు చేయగా.. రూ.28,44,242 విలువైన సొత్తు
స్వాధీనం చేసుకున్నట్లు వ్యయ పరిశీలన అధికారి మురళీధర్ రావు తెలిపారు. రూ.50,400 విలువైన PDS బియ్యం
స్వాధీనం చేసుకున్నామని, పోలీస్, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి రూ.5,25,10,090 విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మీద అభిమానాన్ని తన కూతురి పేరులో చూపెట్టాడు పాలకీడు మండలం శూన్యంపాడులోని ఓ కార్యకర్త. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అదే సంవత్సరంలో కూతురు పుట్టడంతో బాలికకు రమావత్ కాంగ్రెస్ అని పేరుపెట్టాడు. అనంతరం కాంగ్రెస్ మీద అభిమానంతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం అందించే ఏ సాయాన్ని కూడా తీసుకోకపోవడం గమనార్హం.
నగదు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి కొంత మొత్తం అందజేసినట్లు ఎస్సై పరశురాములు తెలిపారు. మిరుదొడ్డి మండలంకు చెందిన అందే స్వామి 2023లో సైబర్ నేరస్థుల బారిన పడి తన ఖాతాలో ఉన్న రూ.75 వేలను పోగొట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరస్తుడి ఖాతాను హోల్డ్ చేసి ఖాతాలో ఉన్న రూ.23,200 నగదును న్యాయస్థానం ఆదేశాల మేరకు బాధితుడికి చెక్కు అందజేశారు.
గంజాయి తాగొద్దన్నందుకు <<12992370>>తండ్రిపై కొడుకు పెట్రోల్ పోసి<<>> దారుణంగా హత్య చేసిన ఘటన RR జిల్లా తుర్కయాంజల్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. కొల్లాపూర్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రవీందర్‌ను కొడుకు అనురాగ్ గంజాయి మత్తులో కోపోద్రిక్తుడై హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు నిందితుడు అనురాగ్(25)ను శుక్రవారం అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు CI తెలిపారు.
కొడుకులు గొడవ పడుతున్నారని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట మండలం నాగేపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగామణి(55)కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయ భూమి విషయంలో కొడుకులిద్దరూ 15 రోజులుగా గొడవ పడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన గంగామణి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొడుకుల మధ్య జరిగిన గొడవతో తల్లి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదైంది.
అయిజ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఎస్ఐ విజయభాస్కర్ వివరాలు మేరకు.. గ్రామానికి కృష్ణారెడ్డి తన ఇంటికి తాళం వేసి పనిమీద కర్నూలు వెళ్లారు. రాత్రి తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్ళి పరిశీలించగా రెండు లక్షల రూపాయలు, ఆరు తులాల బంగారం చోరీకి గురైందని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
మహారాష్ట్రకు చెందిన బృందంతో పాటు జిల్లాలోని మూడు అటవీ శాఖ బృందాలు థర్మల్ డ్రోన్ల సాయంతో ఏనుగు జాడను గుర్తించాయి. శుక్రవారం ఉదయం కమ్మర్గాంలోని పల్లె ప్రకృతి వనంలో స్థానికులకు ఏనుగు కనిపించింది. సాయంత్రం మొర్లి గూడ అటవీ సమీపం నుంచి ప్రాణహిత నది తీరం దాటి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లినట్టు డ్రోన్ కెమెరా ద్వారా నిర్ధారించుకున్నట్లు ఇన్‌ఛార్జ్ FRO సుధాకర్ తెలిపారు.
కుటుంబ సభ్యులు మందలించారని ఓ బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కామేపల్లి మండలంలో జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద్రాల గ్రామానికి చెందిన బాలుడు ఇటీవలే 10 తరగతి పరీక్షలు రాసి ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే, ఏదైనా పని చేయాలంటూ కుటుంబీకులు సూచించడంతో మనస్తాపానికి గురైన బాలుడు శుక్రవారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేశారు.
గిరిజన విద్యార్థులు న్యాయ విద్యలో రాణించేలా ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ప్రత్యేకంగా న్యాయ విద్య అభ్యసించేలా మొట్టమొదటి గిరిజన లా కళాశాలను మూడేళ్ల కిందట సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. దేశంలోనే ఏర్పడిన మొదటి ఎస్టీ గురుకుల న్యాయ కళాశాల ఇది. ఇంటర్మీడియట్ అర్హతతో లాసెట్ రాసిన వారిలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఐదేళ్లలో బీఏ, ఎల్పీబీబీ పూర్తి చేసేందుకు వీలుంటుంది.
Sorry, no posts matched your criteria.