India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు సార్వత్రిక ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ డా.సత్యశారద కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబధిత అధికారులు ఉన్నారు.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,555 ధర పలకగా.. నేడు(సోమవారం) రూ.7,400కి తగ్గింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ ధర కిలోకి రూ.200 నుంచి రూ.220 వరకు పలుకుతున్నది. అలాగే స్కిన్‌లెస్ కేజీకి రూ.250- 260 ధర, లైవ్ కోడి రూ.140- 150 ధర ఉన్నది. సిటీ తో పోలిస్తే పల్లెల్లో వీటి ద్వారా రూ.10-20 తేడా ఉంది. కాగా గతవారంతో పోలిస్తే నేడు ధరలు స్వల్పంగా పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.
వరంగల్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి వర్షపాతం నమోదైంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మొత్తం జిల్లా వ్యాప్తంగా 18.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. వీటిలో ఎక్కువ వర్షం నెక్కొండ మండలంలో 14.9 మి.మీగా నమోదు కాగా, పర్వతగిరిలో 2.7 మి.మీ, రాయపర్తిలో 0.5 మి.మీ వర్షం కురిసింది.
ఎనుమాముల మండల బియ్యం నిల్వ కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. నిల్వలో ఉన్న బియ్యం నాణ్యత, భద్రతా ఏర్పాట్లు, నిల్వ విధానం, రికార్డుల నిర్వహణను జాగ్రత్తగా పరిశీలించారు. సమర్థంగా నిర్వహణ కొనసాగించి రైతులకు, వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు మరింత పటిష్టం చేయాలని సూచించారు.
ఏనుమాముల బియ్యం నిల్వ కేంద్రంలో ముక్కిన బియ్యం, మధ్యాహ్న భోజన పథకం బియ్యాన్ని కలిపి ఉంచిన వ్యవహారంపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో తనిఖీలు నిర్వహించిన ఆమె, ఈ నిర్లక్ష్యానికి కారణమైన పౌరసరఫరాల డీఎం, ఎం.ఎల్.ఎస్. ఇన్‌ఛార్జిలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌యార్డులో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVMs)ను జిల్లా కలెక్టర్ సత్య శారదా పరిశీలించారు. ఈ తనిఖీలో ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీలు, నిల్వ విధానం తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు. పారదర్శకతను కాపాడుతూ ఎన్నికల పక్రియపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడమే ఈ తనిఖీ లక్ష్యమని తెలిపారు.
వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. 24 గంటల్లో అత్యధికంగా వరంగల్ మండలంలో 82.9 మి.మీ, గీసుగొండ 65.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 20.5 మి.మీ, కాగా మొత్తం 267.1 మి.మీ. వర్షం పడింది.
కొన్ని మండలాల్లో స్వల్పంగా వర్షపాతం నమోదు కాగా ఖానాపూర్, చెన్నారావుపేట మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.
వరంగల్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా అధికారి అపర్ణ తెలిపారు. ఈనెల 12న ఉదయం 9 గంటలకు రాయపర్తి గురుకుల పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్, ఒరిజినల్ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. మెరిట్ జాబితా ఆధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తారని పేర్కొన్నారు.
‘కేంద్ర ప్రభుత్వ పథకాలకు మీరు అర్హులు. లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోండి’ అంటూ వాట్సాప్ సహా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలను నమ్మొద్దని వరంగల్ పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు లింకులు మోసాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, ప్రజలు ప్రభుత్వ పథకాల కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలి అని సూచించారు. ఫేస్‌బుక్‌లో అధికారిక పేజీ ద్వారా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.