India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే మొక్కజొన్న ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. సోమవారం మక్కలు(బిల్టీ) క్వింటాకి రూ.2,545 పలకగా.. నేడు రూ.10కి తగ్గి రూ.2535కి చేరింది. రైతులు నాణ్యమైన, తేమలేని సరుకులు మార్కెట్‌కు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు పోలీసు శాఖలో ఇచ్చే అతి ఉత్కృష్ట సేవా పతకం వరంగల్ సీసీఎస్ సీఐకి లభించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈయన 2002లో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం సీఐ బాలాజీ వరప్రసాద్‌కి అతి ఉత్కృష్ట సేవా పథకం లభించింది. తాజాగా అతి ఉత్కృష్ట అవార్డుకు ఎంపిక కావడంతో పలువురు పోలీస్ అధికారులు వారి మిత్రులు అభినందించారు.
ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. విద్యుత్ కొరత అధిగమించేందుకు దేవాదాయ భూముల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఫస్ట్ ఫేస్‌లో ఐదు జిల్లాలోని 231 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలోని ఆసుపత్రులు, డయాగ్నస్టిక్స్ సెంటర్స్ తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నియమాలను తప్పకుండా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని DMHO డా.లలితా దేవి తెలియచేశారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదలచేశారు. ఆయా యాజమాన్యాలు వివిధ సేవలకు సంబంధించిన తారీఫ్ లిస్టును తప్పకుండా విజిటర్స్‌కి కనిపించేలా ప్రదర్శించాలన్నారు.
ఎమ్మెల్సీ స్థానాల ఓటరు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఇందులో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు వస్తున్న దరఖాస్తుల విచారణ మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలన్నారు.
పొరపాట్లకు తావులేకుండా ప్రజల సమగ్ర సమాచారం నమోదు చేయాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆశా కార్యకర్తలను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నమోదులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఎలాంటి తప్పులకు తావు లేకుండా వ్యక్తుల సమగ్ర సమాచారం నమోదు చేయాలని సూచించారు.
రక్తదానం ప్రాణదానంతో సమానమని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈనెల 23న నిర్వహించనున్న రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. రక్తదాన శిబిర కార్యక్రమానికి యువత అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల్, నవీన్, రాజ్, తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామ సమీపంలో కాసేపటి క్రితం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని జామండ్లపల్లి-కంబాలపల్లి శివారులో ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు గూడూరు మండలం పానుగోడు గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 10 వార్డుల పరిధిలో 928 మంది పురుషులు, 863 మంది మహిళలు, మొత్తం 1791 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, మహిళల కంటే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అటు పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరగనుండగా గ్రామంలో స్థానిక ఎన్నికలపై ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. నేడు మక్కలు(బిల్టీ) క్వింటాకి రూ.2,545 పలికింది. గతవారం బుధవారం రూ.2,416 ధర, గురువారం రూ.2,420, శుక్రవారం రూ.2,470 ధర పలికాయి. పత్తిధరలు మళ్లీ పెరుగుతుండడంతో మొక్కజొన్న పండించిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.