India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతిచెందగా.. రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి.
చింతచెట్టు నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. వర్ధన్నపేటలోని నీగిరిస్వామి తండాకి చెందిన నేతవత్ నిమ్మా కూలి పనులు చేస్తుంటాడు. ఇల్లందలో చింతకాయ దులపడానికి కూలికి వెళ్లి ప్రమాదవశాత్తు చెట్టుపైనుంచి పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చందర్ తెలిపారు.
సూర్యాపేట(D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్‌లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34), ఆయన భార్య రేణుక (28), కుమార్తె రిషిత(8) వెళ్లారు. తిరిగి HYD వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
HNK కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో కలిపి మొత్తం 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ- ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పదో తరగతి నుంచి బీటెక్ చేసిన ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 4న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని గిరిజన భవన్‌లో జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా సూచించారు. ఆసక్తి గల వారు తమ బయోడేటాతో హాజరుకావాలని సూచించారు.
పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని GWMC కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరపు పన్నులు చెల్లించడానికి 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, దీర్ఘకాలంగా పన్నులు చెల్లించని వారికి ఇప్పటికే రెడ్ నోటీసులు అందించి ఆస్తులను జప్తు చేస్తున్నామని హెచ్చరించారు.
HNK జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో చెరువు మూలమలుపు వద్ద టిప్పర్ లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో దుర్గం పవన్ కళ్యాణ్ (22), బౌతు మహేష్ (24) అనే <<15861672>>ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి<<>> చెందారు. సీతంపేట గ్రామానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్‌లో BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు పడుతుందా..? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..? స్టే.ఘనపూర్‌లో ఉప ఎన్నికలు జరుగుతాయేమోనని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
ఐపీఎల్ మొదలు కావడంతో ఇప్పుడు అందరి నోటా బెట్టింగ్ మాటే. ఆటను అస్వాదించే వాళ్లు కొందరైతే, వ్యసనమై బెట్టింగ్‌లో రూ.లక్షల్లో నష్టపోయి SUICIDE చేసుకునే వాళ్లు కోకొల్లలు. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు బెట్టింగ్‌లపై నిఘా పెట్టారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించాల్సిన బాధ్యత ఉందన్నారు.
కాజీపేట నుంచి డోర్నకల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు వెళ్లే (MEMU) ట్రైన్ నంబర్ 67269) ఈరోజు నుంచి ప్రారంభమైంది. ట్రైన్ ఉ.6:40 ని.లకు బయలుదేరి మధ్యాహ్నం 12: 00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మూడో లైన్ పనులు, కారణాల వల్ల కొంతకాలంగా ఈ ట్రైన్ నిలిపివేశారు. పనులు పూర్తి కావడంతో ఈ రైలును మళ్లీ పునరుద్ధరించారు.
Sorry, no posts matched your criteria.