India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లాలో మానసిక సమస్యలతో బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. జిల్లాలోని రాయపర్తి మండలం సన్నూరు గ్రామానికి చెందిన పండు(16) మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు నోరు పారేసుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డిని మించి పోతున్నారంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఎక్స్ వేదికగా మాజీ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న మహిళ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. రాను రాను దిగజారుడు మాటలతో సభ్య సమాజం సిగ్గు పడేలా చేస్తున్నారని అన్నారు.
హనుమకొండలో ప్రసిద్ధి పొందిన సిద్దేశ్వర ఆలయంలో శనివారం శనీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సిద్దేశ్వరుని రవికుమార్ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. శనివారం సందర్భంగా నగరంలోని భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.
గంజాయి, పీడీఎస్ బియ్యం అక్రమ సరఫరా, ప్రభుత్వ నిషేధిత గుట్కాలపై ఉక్కుపాదం మోపి నిందితులను అరెస్టు చేస్తున్న హనుమకొండ టాస్క్ ఫోర్స్ పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబ కిషోర్ ఝా అభినందించి రివార్డును అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. టాస్క్ ఫోర్స్ పోలీసులు నిత్యం అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించి నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని టాస్క్ ఫోర్స్ పోలీసులకు సూచించారు.
వరంగల్ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం తెలంగాణ దర్శిని కార్యక్రమాల్లో భాగంగా ఎడ్యుకేషనల్, హెరిటేజ్ టూర్ కోసం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల, రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, యువ టూరిజం క్లబ్ల్స్ ఎంపిక చేసి 2వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు క్లబ్బులు ఏర్పాటు చేయాలన్నారు.
పోలీస్ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని వరంగల్ సీపీ పోలీసు అధికారులను హెచ్చరించారు. నెలవారీ నేర సమీక్షలో భాగంగా ఆయన శుక్రవారం సీపీ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ, ఏసీపీ, ఇన్స్ స్పెక్టర్లు, ఎస్ఐలను పెండింగ్ కేసులు, నిందితుల అరెస్ట్, కేసుల దర్యాప్తు స్థితిగతులపై కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్సీ తక్కల్కపల్లి రవీందర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వర్షా కాలం రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు రైతన్నలను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా క్వింటా కొత్తపత్తి ధర నిన్నటి లాగే నేడు కూడా రూ.7,000 పలికింది. గత నాలుగు రోజులుగా ధర చూస్తే.. సోమవారం రూ.7,100, మంగళవారం రూ.7,010, బుధవారం రూ.7,030 గురువారం రూ. 7వేలు పలికింది.
హన్మకొండలో ప్రసిద్ధిచెందిన హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో ఈరోజు పద్మాక్షి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. క్రోది నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, నవమి మాసం, శుక్రవారం సందర్భంగా వివిధ రకాల పూలతో, పూలమాలలతో అలంకరించారు. అలాగే భక్తుల సమక్షంలో అమ్మవారికి హారతి ఇచ్చారు. స్థానిక భక్తులు గుట్టపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మను ఈరోజు MHBD ఎంపీ పోరిక బలరాం నాయక్ కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం కాసేపు మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలపై గవర్నర్ జిష్ణుదేవ వర్మతో ఎంపీ బలరాం నాయక్ చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.