India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ఉదయం 11.00 గంటలకు జాబ్ మేళాకు హాజరు కావాలని మరిన్ని వివరాలకు 9848895937 నంబర్లు సంప్రదించాలని కోరారు.
తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన మౌనిక భద్రాద్రి జోన్లో 9వ ర్యాంకుగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగం కచ్చితంగా సాధించాలని కన్న తండ్రి కలను ఎట్టకేలకు కూతురు నెరవేర్చింది. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మౌనిక సగృహానికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈనెల 21 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(144 సెక్షన్) అమలులో ఉంటుందని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులుగా ఉండొద్దని సీపీ సూచించారు.
మరో రెండు రోజుల్లో వార్షిక పరీక్షలకు వెళ్లాల్సిన పదో తరగతి విద్యార్ధి గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లిలో చోటుచేసుకుంది. పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేటలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అశ్వంత్ బుధవారం మృతి చెందాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
బడ్జెట్ సంబంధిత సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. రేపు జరగబోయే 2024-25కు సంబంధించిన బడ్జెట్ సమావేశం నిర్వహణ దృష్ట్యా బుధవారం ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి బడ్జెట్ అంశాలపై మేయర్ సమీక్షించారు. అధికారులు ఆదాయ వ్యయాలపై అవగాహన కలిగి ఉండి, సభ్యులు అడిగే అంశాలకు సమాధానం ఇచ్చే విధంగా ఉండాలని అన్నారు.
వరంగల్ జిల్లా కాన్ఫరెన్స్ హాల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై కలెక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మండలాల్లో వేసవి నీటి ఎద్దడి నివారణ చర్యలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పై మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలతో సమీక్ష పురోగతి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్‌గా డా.పివి నందకుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీ ప్రతిష్టను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. యూనివర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో ముచ్చటించారు. వీసీకి రిజిస్టర్ సంధ్య, ఎగ్జామినేషన్ కంట్రోలర్ రమేశ్, ప్రవీణ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు.
కాళోజి నారాయణ రావు హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీకి కొత్త వైస్ ఛాన్స్‌లర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నియమించారు. ఇతడు మూడు సంవత్సరాలు కొనసాగుతారని నియామక పత్రంలో తెలిపారు. నేడు లేక రేపు కొత్త వైస్ ఛాన్స్లర్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
వేసవికాలంలో సూర్యుడు అగ్నిగోళాన్ని తలపిస్తుంటాడు. ప్రస్తుతం మార్చి నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుంచి అలా వేడెక్కి సూర్యుడు సాయంత్రానికి కాస్త శాంతిస్తాడు. అలాగే సాయంత్రం వేళ అందంగా కూడా కనిపిస్తాడు. వరంగల్ లోని హంటర్ రోడ్ లో బుధవారం ఇలా సూర్యాస్తమయం ప్రజలను ఆకట్టుకుంది. SHARE
ఈనెల 21 నుండి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహణపై సమీక్షించారు. ఉ.9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. దీనికోసం 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు ఫ్లయింగ్ స్కార్డ్స్ 49 మంది శాఖ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.