India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కేజీ రూ. 200-210 ధర పలకగా.. స్కిన్లెస్ కేజీ రూ.230-250 గా ఉంది. అలాగే లైవ్ కోడి రూ.150-160 ధర పలుకుతున్నది. కాగా సిటీతో పోలిస్తే పల్లెలలో రూ.10-20 వ్యత్యాసం ఉన్నది. గత వారం శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో అమ్మకాలు కొంత తగ్గగా.. ఈరోజు అమ్మకాలు కొంత పెరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్ యాక్టివిటీని తరచూ పరిశీలించాలని వరంగల్ పోలీసులు సూచించారు. అనుమానాస్పదమైన ట్రాన్సాక్షన్లు గమనించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రజలకు తెలియజేశారు. అలాగే తెలియని వ్యక్తులు పంపే లింకులు క్లిక్ చేయడం, క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయడం వంటి చర్యల వల్ల మోసపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఓ పాము బీర్ టిన్‌లో తలదూర్చి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులోని ఎస్సారెస్పీ కాలువ కట్టపై కనిపించింది. తాగి పడేసిన టిన్ బీర్‌లోకి పాము తల దూర్చడంతో తిరిగి బయటకు రావడానికి ఇబ్బందులు పడింది. ముందుకు, వెనక్కి వెళ్లినా బీర్ టిన్‌లో పెట్టిన తల బయటకు రాలేదు. బండారి కుమారస్వామి అనే గీత కార్మికుడు దీన్ని గమనించి అతని ఫోన్లో బంధించాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకల్లో భాగంగా కొన్ని కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. WGL జిల్లాలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడగా ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. జనగాం జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లాలో మరో 3 వివిధ ప్రమాదాల్లో మృతి చెందారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 14 మంది వివిధ ప్రమాదాల్లో మృతిచెందగా, ఆ కుటుంబాలు పండగపూట విషాదంలో మునిగాయి.
వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఏదైనా అసౌకర్యం కలిగితే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని కలెక్టర్ అన్నారు. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతం చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.
రాయపర్తి (M) ఉమ్మడి సన్నూరు గ్రామానికి సుదీర్ఘకాలం పాటు(13ఏళ్లు) సర్పంచిగా సేవలందించిన కుందూరు భీష్మారెడ్డి (74) శుక్రవారం సాయంత్రం తన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. వెంకటేశ్వరపల్లి, జయరాంతండా(S),బాలు నాయక్ తండాలతో కూడిన సన్నూరు ఉమ్మడి గ్రామానికి 1990-2003 వరకు రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్‌గా, 3 ఏళ్లపాటు గ్రామ అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై పరిపాలన సాగించారు.
నర్సంపేట ‘గాంధీ జయంతి వేళ CI సమక్షంలో జంతు బలి.. విమర్శలు’ పేరిట వచ్చిన కథనంపై వరంగల్ కలెక్టర్ సత్య శారద స్పందించారు. స్థానిక నర్సంపేట ఆర్డిఓతో ప్రాథమిక విచారణ జరిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. దీంతో పాటుగా నర్సంపేట సీఐపై చర్యల కోసం వరంగల్ ఈస్ట్ జోన్ డీసీసీపీకి సిఫార్సు చేశారు.
వరంగల్ ఎంజీఎం సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం విజయ దశమి పురస్కరించుకుని సాయంత్రం అమ్మవారు వెండి చీరెలో దర్శనమిచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
వరంగల్ కలెక్టరేట్లో గురువారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.