India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో సగటు 18.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఖానాపూర్ మండలంలో 76.8 మి.మీ వర్షం కురిసింది. వర్ధన్నపేటలో 41.5 మి.మీ, పర్వతగిరి 30.1 మి.మీ వర్షపాతం నమోదైంది. చెన్నారావుపేట, రాయపర్తి, నెక్కొండ మండలాల్లో 20 మి.మీ.కు పైగా వాన పడింది. జిల్లా మొత్తం వర్షపాతం 238.2 మి.మీ.గా నమోదైంది. కొన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి.
జిల్లాలో సీజనల్ వ్యాధులు నియంత్రణలో ఉన్నాయని డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావు తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు మలేరియా 7, డెంగ్యూ 54 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రి ప్రజలకు ప్రాణదాతగా నిలుస్తోందని ప్రత్యేక అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. HYDలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారుల సమీక్షలో పలు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలకు 24/7 కంట్రోల్ రూమ్ నంబర్లు 1800 425 3424, 9154 252936 అందుబాటులో ఉన్నాయన్నారు.
భారీ వర్షాల ప్రభావంతో పోతన రోడ్‌లోని మరాఠీ భవన్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ డా.సత్య శారద సందర్శించారు. ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, బృందావన్ కాలనీ నిర్వాసితుల కోసం అందిస్తున్న తాగునీరు, ఆహారం, వైద్యసదుపాయాలు, వసతులను పరిశీలించారు. భోజన నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున పలు సూచనలు చేశారు.
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ)కి రూ. 2,380 ధర వచ్చింది. అలాగే సూక పల్లికాయకు రూ.6,200, పచ్చి పల్లికాయకు రూ.4,900 పలికింది. పసుపు రూ.12,003 ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. వర్షంలో సైతం కొనుగోళ్లు చురుగ్గా సాగాయి.
వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడింది. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి నగరంతో పాటు ఆయా గ్రామాల్లో సైతం చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నేడు 33.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. జిల్లాలోని 13 మండలాల్లో మోస్తారుగానే వర్షపాతం ఉందని తెలిపింది. మరో రెండు రోజులపాటు కూడా వర్షసూచన ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లాలో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కలెక్టర్ సత్య శారద అన్నారు. జిల్లాలో 816 చెరువులు ఉండగా, అందులో 262 చెరువులు సర్ ప్లస్‌లో ఉన్నాయన్నారు. చెరువులకు ఎలాంటి గండి పడ్డా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ శాఖల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నామన్నారు. అత్యవసర సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
రాష్ట్రంలోనే ఆర్టీసీ వరంగల్-1 డిపో అగ్రస్థానంలో నిలిచింది. రాఖీ పండుగ రోజు రాష్ట్రంలోని 97 డిపోల్లో వరంగల్-1 డిపో రూ.49.14 లక్షల ఆదాయాన్ని రాబట్టినట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. బస్సులు 79,057 కి.మీలు తిరిగాయన్నారు. మహాలక్ష్మి పథకంతో పాటు మామూలు ప్రయాణికులతో ఈ ఆదాయాన్ని రాబట్టినట్లు వెల్లడించారు.
రానున్న 72 గంటల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరంగల్ కమిషనర్ పరిధిలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని అలాగే శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇండ్లల్లో నివసించే వారు సైతం సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కమిషనర్ తెలిపారు.
వరంగల్: దేవాదాయ శాఖలోని పలువురు ఉద్యోగులపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బదిలీలు జరిగాయి. వరంగల్ భద్రకాళి ఆలయం నుంచి అద్దంకి విజయ్ కుమార్‌ను మేడారానికి, అక్కడి క్రాంతిని భద్రకాళికి బదిలీ చేశారు. రికార్డు అసిస్టెంట్ ఆకారపు వీరన్నలను పరస్పరం బదిలీ చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. ఉద్యోగులపై ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.