India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో శుక్రవారం నాగసాదు అఘోరి పర్యటించింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఇల్లందలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శించింది. కాలభైరవుడికి ప్రత్యేక పూజలు చేసింది. కాలభైరవ ఆలయానికి నాగసాదు అఘోరి వచ్చిందన్న విషయం తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అఘోరిని చూసేందుకు తరలివచ్చారు.
ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారదా, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, GWMC కమిషనర్ అశ్విని తానాజీ వాకడే శుక్రవారం పరిశీలించారు. హెలికాప్టర్ దిగనున్న ఆర్ట్స్ కళాశాల మైదానంతో పాటు బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం, కాజీపేట ఆర్వోబీని కలెక్టర్లు పరిశీలించారు.
ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే ప్రసవించగా.. 108 సిబ్బంది సీపీఆర్ చేసి చలనం లేని బిడ్డను కాపాడారు. HNK జిల్లా వేలేరు మండలం లోక్యా తండాకు చెందిన భూక్య అఖిల ఆరు నెలల గర్భిణి. ఆమెకు గురువారం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా అఖిల.. మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువులో చలనం లేకపోవడంతో 108 సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. తల్లీబిడ్డలను ఆస్పత్రిలో చేర్పించారు.
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించే అఖండ జ్యోతి, గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో మోహన్ బాబు తెలిపారు. తిరువన్నామలై అరుణాచలం స్ఫూర్తితో పాలకుర్తి ఆలయ గుట్టపై 8 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తులో అఖండ జ్యోతిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యశస్వని రెడ్డి హాజరుకానున్నారు.
హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా జిల్లా అప్రాప్రియేట్ అథారిటీ సమావేశం కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో చట్టం అమలు తీరును, చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, ఇప్పటి వరకు నమోదైన కేసులు, జిల్లాలో బాల, బాలికల నిష్పత్తిని గురించి సమీక్షించారు. లింగ నిర్ధారణకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
హనుమకొండలో దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభు లింగం శ్రీ సిద్దేశ్వర ఆలయంలో అరుదైన దృశ్యం కనిపించింది. సాయంకాలం సంధ్యా సమయంలో కార్తీక పౌర్ణమి ఘడియల్లో శివయ్య శిరస్సుపై జాబిల్లి విరజిల్లుతున్నట్లు కనిపించింది. పలువురు భక్తులు ఈ దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాలో బంధించారు.
వరంగల్ రీజియన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ రీజన్ పరిధిలో బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు నెంబర్ 9959226056 కి ఫోన్ చేసి రీజియన్ లోని బస్సు సర్వీసులు, ప్రయాణికుల సర్వీసులు మెరుగుదలకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు గడువును పెంచినట్లు ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. నవంబర్ 11న దరఖాస్తు చివర తేదీ కాగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20 వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత, దరఖాస్తు విధానం తదితర వివరాలకు ఆన్లైన్లో చూసుకోవాలని తెలిపారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయకు సోమవారం రూ.5,510 ధర రాగా.. మంగళవారం రూ.5,900, బుధవారం రూ.5550 రాగా నేడు రూ.6870 ధర వచ్చింది. అలాగే మక్కలు బిల్టి క్వింటాకి మంగళవారం రూ.2,465 ధర, బుధవారం రూ.2,480 ధర రాగా గురువారం రూ. 2440 కి పడిపోయింది. మరోవైపు పసుపు క్వింటాకి రూ.12,059 ధర పలికింది.
జనగామ జిల్లాలో గ్రూప్- 3 పరీక్ష నిర్వహణకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం గ్రూప్ – 3 పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, రూట్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష రాసే అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, అర గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.