News June 11, 2024
ఈనెల 15 నుంచి యూరో ఛాంపియన్‌షిప్
ఓ వైపు క్రికెట్ వరల్డ్‌కప్ కొనసాగుతుండగా మరో నాలుగు రోజుల్లో ఫుట్‌బాల్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి జర్మనీ వేదికగా యూరో ఛాంపియన్‌షిప్ జరగనుంది. తొలి మ్యాచులో ఆతిథ్య జర్మనీ, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీకి మొత్తం 51 దేశాలు అర్హత సాధించాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఇటలీ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
Similar News
News December 23, 2024
శ్రీవారి భక్తుల కోసం అలిపిరిలో బేస్ క్యాంప్: శ్యామలరావు
AP: శ్రీవారి భక్తులు సులభంగా సమాచారం తెలుసుకోవడానికి వీలుగా ‘చాట్ బాట్’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు TTD ఈవో శ్యామలరావు వెల్లడించారు. భక్తుల వసతి కోసం అలిపిరిలో 40 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటుచేస్తామన్నారు. రూ.70 లక్షల విలువైన పరికరాలతో టీటీడీ సొంతంగా ఏర్పాటుచేసుకున్న ల్యాబ్ జనవరి నుంచి అందుబాబులోకి వస్తుందని చెప్పారు. అన్నప్రసాదాలు,లడ్డూలు మరింత నాణ్యంగా అందిస్తున్నట్లు తెలిపారు.
News December 23, 2024
ఘనంగా పీవీ సింధు వివాహం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచారు. ఈ వేడుకకు దాదాపు 140 మంది అతిథులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. వివాహ ఫొటోలను ఇరు ఫ్యామిలీలు ఇంకా విడుదల చేయలేదు. రేపు హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.
News December 23, 2024
జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
వచ్చే నెల 20 నుంచి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సుకు భారత్ నుంచి ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఇందులో పాల్గొంటారు. వీరితో పాటు ఏపీ మంత్రి లోకేశ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, TN మంత్రి టీఆర్‌బీ రాజా, యూపీ మంత్రి సురేశ్ ఖన్నా తదితరులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.