News February 21, 2025

దోబూచులాడుతున్న బంగారం ధరలు!

image

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర తగ్గగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ కాస్త పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 తగ్గి రూ.80,250లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60 పెరగడంతో రూ.88,100లకు చేరింది. అటు వెండి ధర మాత్రం రూ.100 తగ్గి కేజీ రూ.1,07,900 వద్ద కొనసాగుతోంది.

Similar News

News February 22, 2025

తండ్రీకొడుకుల సాహసం.. బైక్‌పై కుంభమేళా యాత్ర

image

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు ఎలాగైనా వెళ్లాలనే తపన ఆ తండ్రీకొడుకులను 3900 KM బైక్‌పై వెళ్లేలా చేసింది. కర్ణాటక ఉడిపిలోని శిర్వకు చెందిన ప్రజ్వల్ తన తండ్రి రాజేంద్ర(52) కోరికను తీర్చేందుకు బైక్‌పై రోజుకు 500KM చొప్పున 4 రోజులు ప్రయాణించి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకెళ్లాడు. పవిత్ర స్నానం తర్వాత FEB 10న బయల్దేరి 13న శిర్వకు వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ రూ.20000తో టూర్ ముగించారు.

News February 22, 2025

రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు.. గడువు పొడిగింపు

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 246 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పొడిగించింది. ఈ నెల 28 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జూనియర్ ఆపరేటర్-215, జూనియర్ అటెండెంట్-23, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టులు 8 ఉన్నాయి. ఎంపికైన వారికి ఉద్యోగాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం లభిస్తుంది. సీబీటీ, ఇతర టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.
సైట్: iocl.com

News February 22, 2025

ఎల్లుండి నుంచి ఇస్రో ‘యువికా’ దరఖాస్తుల స్వీకరణ

image

ఇస్రో నిర్వహిస్తున్న యూత్ సైన్స్ ప్రోగ్రామ్ ‘యువికా’కు రిజిస్ట్రేషన్లు ఈ నెల 24 నుంచి మొదలుకానున్నాయి. వచ్చే నెల 23 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. 8వ తరగతి పూర్తైన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. ఎంపికైన వారికి మే నెలలో 2వారాల పాటు స్పేస్ టెక్నాలజీ, సైన్స్‌లో శిక్షణనిస్తారు.

error: Content is protected !!