News March 4, 2025
ఆదోనికి పోసాని కృష్ణమురళి

AP: గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని ఆదోని PSకు తరలిస్తున్నారు. అక్కడ ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో పీటీ వారెంట్ దాఖలు చేసి తీసుకెళ్తున్నారు. మరోవైపు, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ వేయగా దానిపై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. రాజంపేట జైలులో ఉన్న ఆయన్ను నిన్న పోలీసులు పీటీ వారంట్‌పై నరసరావుపేట తీసుకురాగా, జడ్జి 10 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.
Similar News
News March 4, 2025
దుఃఖాన్ని దిగమింగుతూ పరీక్ష రాసిన విద్యార్థి

తమిళనాడులో సునీల్ అనే విద్యార్థి తన తల్లి మరణంలోనూ తన కర్తవ్యాన్ని వీడలేదు. సుబ్బలక్ష్మీ అనే మహిళ సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించింది. అదే రోజు ఇంటర్ పరీక్షలు మెుదలు. నీ భవిష్యత్తే తల్లి కోరుకునేదని, పరీక్ష రాయాలని బంధువులు ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర దుఃఖంలోనూ తల్లికి పాదాభివందనం చేసి పరీక్ష రాసాడు. ఈ ఘటన అందరిని కంటతడి పెట్టించింది. ప్రభుత్వం అతనికి అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
News March 4, 2025
ఉర్దూ పాఠశాలల పని వేళలు మార్పు

AP: రంజాన్ మాసంలో రాష్ట్రంలోని ఉర్దూ పాఠశాలల పని వేళలు ఉ.8 నుంచి మ.1.30 వరకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3-30 వరకు ఈ మేరకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి ఫరూక్ ప్రకటించారు. ఉపాధ్యాయ సంఘాలు, తదితర సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మార్పు చేశామన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం ఓ గంట ముందే వెళ్లేందుకు గత నెల అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.
News March 4, 2025
MLC కౌంటింగ్: 4,320 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి

TG: ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి 4,320 లీడ్ సాధించారు. ఇప్పటివరకు అంజిరెడ్డికి 23,246, నరేందర్ రెడ్డికి (కాంగ్రెస్) 18,296, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 15,740 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.