News July 4, 2024

భోలేబాబాను అందుకే అరెస్ట్ చేయలేదు: పోలీసులు

image

తొక్కిసలాటకు కారణమైన భోలేబాబాను ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి UP పోలీసులు చెప్పిన సమాధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ‘సేవాదార్ వేద్ ప్రకాశ్ మధుకర్ పేరిట సత్సంగ్ నిర్వహణకు అనుమతి తీసుకున్నారు. అందుకే నిర్వహణ కమిటీ సభ్యులను అరెస్ట్ చేశాం. భోలేబాబాను కూడా విచారిస్తాం. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియడంలేదు’ అని తెలిపారు. బాబా వెనకాల రాజకీయ శక్తులుండటంతోనే ఆయనను అరెస్ట్ చేయడంలేదని ఆరోపణలొస్తున్నాయి.

News July 4, 2024

నీటి కొరతతో ఆర్థికవ్యవస్థకు ముప్పు!

image

వడ్డీరేట్లు, ఆర్థిక విధానాల కంటే కూడా నీటి కొరత ఆర్థిక వ్యవస్థను ఎక్కువ ప్రభావితం చేస్తుందంటున్నారు విశ్లేషకులు. ‘ఢిల్లీ వాసులు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. రాజస్థాన్‌లో పలు చోట్ల నాలుగు రోజులకోసారి ట్యాప్ వాటర్ వస్తుంటే, మహారాష్ట్రలో కొన్ని చోట్ల నీటి కోసం 1.5kmపైన వెళ్లాల్సి వస్తోంది. దీనిపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో నీటి కొరతకు వ్యవసాయ, పరిశ్రమ రంగాలు దెబ్బతింటాయి’ అని హెచ్చరిస్తున్నారు.

News July 4, 2024

మామెరు ఫంక్షన్‌లో మెరిసిన అనంత్-రాధిక

image

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి మామెరు వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ నెల 12న వీరి వివాహం ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. 12న శుభ్ వివాహ్, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ్ ఉత్సవ్ జరగనున్నాయి.

News July 4, 2024

12 కీలక అంశాలను పరిష్కరించాలని ప్రధానిని కోరాం: రేవంత్

image

TG: రాష్ట్ర పునర్విభజన చట్టంలో TG, AP మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి స‌హ‌క‌రించాలని PM మోదీని కోరినట్లు CM రేవంత్ వెల్లడించారు. HYD- కరీంనగర్, HYD-నాగ్‌పూర్‌ మార్గాల్లో ఎలివేటెడ్‌ కారిడార్‌లు, రోడ్ల విస్తరణ, 13 రాష్ట్ర రహదారులను NHలుగా అప్‌గ్రేడేషన్, రాష్ట్రానికి అదనంగా మరో 29 IPS పోస్టులు, పెండింగ్ నిధుల విడుదల వంటి 12 కీలకమైన అంశాలను సత్వరం పరిష్కరించాలని కోరినట్లు <>ట్వీట్<<>> చేశారు.

News July 4, 2024

ఏం మాట్లాడుతున్నారండి జగన్ గారు: నాగబాబు

image

AP: పిన్నెల్లికి కోపమొచ్చి EVM పగులగొట్టారన్న జగన్ వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు సెటైర్లు వేశారు. ‘ఏం మాట్లాడుతున్నారండి బాబు? పోలింగ్ కేంద్రంలో నిజంగా అన్యాయం జరిగితే అక్కడ పోలీసులు, ఎన్నికల సిబ్బంది లేరా? మిడిమిడి జ్ఞానంతో మితిమీరిన ఎచ్చులకి పోయినందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇకనైనా పరిణతితో మాట్లాడకపోతే ఈసారి సింగిల్ డిజిట్‌ కట్టబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News July 4, 2024

టీమ్ఇండియా వద్ద ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదు!

image

టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కోసం వివిధ దేశాలు తలపడగా టీమ్ఇండియా ఫైనల్‌లో గెలిచి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ ట్రోఫీని కేవలం ఫొటో షూట్ కోసం మాత్రమే అందిస్తారట. విజేతలు తమ దేశానికి తీసుకెళ్లేందుకు అచ్చం అలాంటిదే ఇయర్, ఈవెంట్ లోగోతో డూప్లికేట్ సిల్వర్‌వేర్ ట్రోఫీని ICC తయారుచేసి అందిస్తుంది. ఒరిజినల్ ట్రోఫీ దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలోనే ఉంటుంది.

News July 4, 2024

త్వరలోనే సీఎం రేవంత్‌ను కలుస్తాం: దిల్‌రాజు

image

TG: CM రేవంత్ సూచన మేరకు సైబర్ నేరాలు, డ్రగ్స్‌ అరికట్టడంలో తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి(TFCC) అధ్యక్షుడు దిల్ రాజ్ తెలిపారు. నటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజమానులు ప్రభుత్వానికి అండగా ఉంటారని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయా విషయాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని దిల్‌రాజు వివరించారు.

News July 4, 2024

ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు: కేసీఆర్

image

TG: రాబోయేది BRS ప్రభుత్వమేనని కేసీఆర్ అన్నారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి వచ్చిన కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ‘ప్రజాస్వామ్యంలో అధికారం, ప్రతిపక్షం శాశ్వతం కాదు. ప్రజా తీర్పే మనకు శిరోధార్యం. అధికారం కోల్పోయామని బాధపడడం సరైన రాజకీయ నాయకుడి లక్షణం కాదు. ప్రజా సంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియే రాజకీయం. దానికి గెలుపు ఓటములతో సంబంధం ఉండదు’ అని వ్యాఖ్యానించారు.

News July 4, 2024

క్రికెట్‌కు బంగ్లా సీనియర్ ప్లేయర్ గుడ్ బై

image

బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ మహ్మదుల్లా రియాద్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా 38 ఏళ్ల మహ్మదుల్లా ఇప్పటివరకు 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000కుపైగా రన్స్ సాధించారు. 150కిపైగా వికెట్లు పడగొట్టారు. కాగా మహ్మదుల్లా 2007లో శ్రీలంకపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.

News July 4, 2024

ఈనెల 8 నుంచి మోదీ రష్యా పర్యటన

image

ప్రధాని మోదీ ఈనెల 8-10 తేదీల మధ్య రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్నారు. 8, 9 తేదీల్లో మోదీ రష్యాలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆ రెండు రోజులు ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఆ మర్నాడు మోదీ ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఆ దేశ నేతలతో ఇరు దేశాల బంధం బలోపేతంపై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఇరు దేశాల్లోని భారతీయులతో ముచ్చటించే అవకాశం ఉంది.