News July 4, 2024

బాలికపై లైంగిక వేధింపులు.. YCP మాజీ ఎమ్మెల్యే అరెస్టు

image

AP: వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికపై సుధాకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ముందు ఆ వీడియో వైరల్ అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

News July 4, 2024

బుమ్రా కొడుకును ఆడించిన మోదీ

image

టీమ్ ఇండియా స్టార్ పేసర్ బుమ్రా తన కుటుంబంతో సహా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా బుమ్రా కొడుకు అంగద్‌ను మోదీ ఎత్తుకుని కాసేపు ఆడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు టీమ్ ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ కూడా మోదీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

News July 4, 2024

రికార్డుల దహనంపై ఆరా తీసిన పవన్

image

AP: పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దహనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. వాటి వివరాలు వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. దస్త్రాల దహనం వెనుక ఎవరున్నారని అడిగిన పవన్.. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు పీసీబీ ఆఫీసుల్లో భద్రతకు అనుసరిస్తున్న విధానాలను వెల్లడించాలని పవన్ పేర్కొన్నారు.

News July 4, 2024

రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా

image

TG: రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు(కేకే) రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామా లేఖను అందజేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ పార్టీ మారిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. నిన్న AICC చీఫ్ ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అంతకుముందు BRSలో ఉన్నారు.

News July 4, 2024

అనంత్- రాధిక పెళ్లి వేడుకలో జస్టిన్ బీబర్ ప్రదర్శన

image

కెనడియన్ సింగర్, పాప్ ఐకాన్ జస్టిన్ బీబర్ ఇండియాకు చేరుకున్నారు. బిలియనీర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌ల వివాహ వేడుకల్లో బీబర్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈనెల 12న వీరి వివాహం జరగనుండగా అంతకుముందు జరిగే సంగీత్ వేడుకలో స్టార్ సింగర్స్ బీబర్, బాద్షా, కరణ్ ఔజ్లా పాటలు పాడి అలరించనున్నట్లు సమాచారం.

News July 4, 2024

BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.67,000కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరగడంతో రూ.73,090 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,500 పెరిగి రూ.97,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

News July 4, 2024

భారత క్రికెటర్ల కోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్ రద్దు

image

బార్బడోస్‌లో ఉన్న భారత క్రికెటర్లు ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫ్లైట్ నెవార్క్ నుంచి ఢిల్లీ రావాల్సినదని, చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసి ఆటగాళ్ల కోసం బార్బడోస్‌కు మళ్లించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేయలేదని సోషల్ మీడియాలో వాపోయారు. దీంతో సీరియస్ అయిన DGCA తమకు సమగ్ర నివేదికను అందించాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది.

News July 4, 2024

సీఐకి ఎదురుపడని పిన్నెల్లిపై హత్యాయత్నం కేసా?: జగన్

image

AP: పాల్వాయిగేటులో ఎస్సీలు ఓట్లు వేయకుండా TDPవాళ్లు అడ్డుకుంటే పిన్నెల్లి అక్కడికెళ్లారని జగన్ చెప్పారు. ‘అక్కడ YCP రిగ్గింగ్ చేసి ఉంటే EVM ఎందుకు పగలగొడతారు? TDP అకృత్యం చేసింది కాబట్టి పిన్నెల్లి అలా చేశారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది. కారంపూడి ఘర్షణ ఘటనలో CI నారాయణస్వామికి పిన్నెల్లి ఎదురుపడలేదు. మే 14న ఘటన జరిగితే 9రోజులకు హత్యాయత్నం కేసు పెట్టారు. ఇది అన్యాయం కాదా?’ అని ప్రశ్నించారు.

News July 4, 2024

బెంగళూరు కమిషనర్‌కు దర్శన్ భార్య లేఖ

image

మర్డర్‌ కేసులో నిందితుడైన కన్నడ నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి బెంగళూరు కమిషనర్‌కు తాజాగా లేఖ రాశారు. కేసులో మరో నిందితురాలైన పవిత్రను ‘దర్శన్ భార్య’ అనొద్దని విజ్ఞప్తి చేశారు. ‘చట్టప్రకారం దర్శన్‌కు నేను మాత్రమే భార్యను. కానీ మీరు, రాష్ట్ర హోంమంత్రి, మీడియా అందరూ పవిత్రను భార్యగా చెబుతున్నారు. అది నాకు, నా బిడ్డకు ఇబ్బందిగా మారుతోంది. దయచేసి మీ రికార్డుల్లో పవిత్రను భార్యగా రాయొద్దు’ అని కోరారు.

News July 4, 2024

గత ఆరు నెలల్లో ఈ ఐదు స్టాక్స్‌దే హవా!

image

సెన్సెక్స్ గత ఏడాది డిసెంబరు 11 నుంచి ఈనెల 3 మధ్య 10వేల పాయింట్లు పెరిగింది. మార్కెట్ విలువ ₹138.89లక్షల కోట్ల నుంచి ₹158లక్షల కోట్లకు చేరింది. ఐదు స్టాక్స్ నుంచే మార్కెట్లలో 50% వృద్ధి నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌టెల్, SBI, మహీంద్రా & మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక TCS, అదానీ పోర్ట్స్, HDFC వంటి 11 స్టాక్స్‌తో 30% వృద్ధి నమోదైంది.