News June 30, 2024

అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు

image

భారత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. T20WC ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ క్లాసెన్ సిక్సర్లు బాదుతుంటే ఆ జట్టుకు విజయావకాశాలు 96.62%గా ఉన్నాయి. భారత్‌ గెలిచే ఛాన్స్ 3.38% మాత్రమే. అయితే హార్దిక్ క్లాసెన్ వికెట్‌ తీయడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. IND గెలిచింది. ఇదే WCలో PAKకు 92% గెలుపు అవకాశాలున్న మ్యాచ్‌నూ బూమ్రా మలుపుతిప్పారు. ఇక గత WCలో పాక్‌పై కోహ్లీ మ్యాజిక్ మనకు తెలిసిందే.

News June 30, 2024

మీలాంటి అధికారులే దేశానికి కావాల్సింది!

image

TG: 2024 బ్యాచ్ ట్రైనీ AIS(All India Services)లు మంచి మనసు చాటుకున్నారు. వారి ట్రావెలింగ్ అలవెన్స్ రూ.1.30లక్షలను ‘సుకన్య సమృద్ధి’కి అందించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 65 మంది ట్రైనీ AISలు HYDలో 100 మంది బాలికలకు ఖాతాలు తెరిపించి ₹1000 చొప్పున జమ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినులందర్నీ ‘బాలికా సుకన్య సమృద్ధి యోజన’లో చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించారు.

News June 30, 2024

భారత్‌కు ICC ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!

image

➥టీ20 WC 2024 ప్రైజ్‌మనీ: దాదాపుగా రూ.93.50 కోట్లు
➥టోర్నీ ఛాంపియన్‌ భారత్‌కు రూ.20.42 కోట్లు, రన్నరప్ SAకు రూ.10.67 కోట్లు
➥సెమీస్‌లో ఓడిన AFG, ENG జట్లకు చెరో రూ.6.56కోట్లు,
➥సూపర్ 8లో ఓడిన USA, WI, AUS, BAN టీమ్‌లకు రూ.3.17 కోట్ల చొప్పున
➥9 నుంచి 12వ ర్యాంకు టీమ్‌లకు రూ.2.5 కోట్లు
➥13 నుంచి 20వ ర్యాంకు జట్లకు రూ.1.87కోట్లు
➥➥గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు రూ.26 లక్షలు అదనం

News June 30, 2024

1 నుంచి 8 తరగతుల ఉమ్మడి పరీక్ష రద్దు

image

APలో ఎలిమెంటరీ(1-8వ తరగతి) విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణ విధానాన్ని హైకోర్టు రద్దు చేసింది. ‘సాల్ట్ పేరుతో 2022లో తెచ్చిన ఈ విధానం చట్ట విరుద్ధం. కామన్ పేపర్, రోజులో 2 పరీక్షలు, నిర్దేశిత టైం టేబుల్ 10వ తరగతి బోర్డు పరీక్షల్ని పోలి ఉన్నాయి. ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు ఏ విద్యార్థీ బోర్డు పరీక్షలో పాస్ కావాల్సిన అవసరం లేదు. అలాగే ఇది ప్రైవేట్ స్కూళ్లకు వర్తించదు’ అని కోర్టు పేర్కొంది.

News June 30, 2024

ఎక్కడ పోయిందో.. అక్కడే వెతుక్కున్నాడు

image

ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి ఈ వరల్డ్ కప్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే 2007 ODI WCలో ఇదే వెస్టిండీస్ గడ్డపై ద్రవిడ్ కెప్టెన్సీలోని భారత్ గ్రూప్ స్టేజీలోనే అవమానకర రీతిలో నిష్క్రమించింది. దీంతో రాహుల్ కొన్నాళ్లకే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పారు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ అదే గడ్డపై కోచ్‌గా WC సాధించారు. అందుకే కప్ తన చేతిలోకి రాగానే ఎన్నడూ ఎమోషన్స్ కనిపించని ద్రవిడ్ మొహంలో తీవ్ర భావోద్వేగం కనిపించింది.

News June 30, 2024

రానా సినిమాలో కేజీఎఫ్ హీరోయిన్?

image

‘KGF’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌లో మరో అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. కిశోర్ అనే కొత్త దర్శకుడితో రానా హీరోగా చేయబోయే సినిమాలో ఆమె నటించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం శ్రీనిధి తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ అనే మూవీ చేస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ ‘వేట్టయాన్’లో రానా కీలకపాత్ర పోషిస్తున్నారు. తేజ దర్శకత్వంలోనూ ‘రాక్షస రాజ్యం’ అనే మూవీ చేయనున్నారు.

News June 30, 2024

వీళ్లనా పక్కన పెట్టేద్దామనుకుంది?

image

గుర్తుందా? ఈ T20WCలో విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం ఇవ్వడం కష్టమేనని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. రోహిత్‌ను కూడా పక్కనపెట్టేస్తారని ఒకానొక సమయంలో ప్రచారం జరిగింది. 2022 T20WC తర్వాత వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌లో జట్టుకు దూరంగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఎన్నో అనుమానాల మధ్య జట్టులోకి వచ్చిన ‘రోకో’ భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. భారత్‌కు కప్ అందించి T20Iలకు వీడ్కోలు పలికారు.

News June 30, 2024

TG నుంచి ఏపీకి ₹5వేల కోట్లు రావాల్సి ఉంది: మంత్రి నారాయణ

image

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పూర్తికాలేదని మంత్రి నారాయణ అన్నారు. AP హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం TG నుంచి APకి సుమారు ₹5,170cr రావాల్సి ఉందని తెలిపారు. కోర్టుల్లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. AP, TG జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉందన్నారు.

News June 30, 2024

భారత అభిమానులను వణికించిన ఆ ఓవర్

image

T20 WC ఫైనల్లో అక్షర్ వేసిన 15వ ఓవర్ అభిమానులకు చెమటలు పట్టించింది. అప్పటికి SA 36బంతుల్లో 54రన్స్ కొట్టాలి. 15వ ఓవర్‌లో క్లాసెన్ ఉతికి ఆరేశారు. 2సిక్సర్లు, 2ఫోర్లతో పాటు 2రన్స్ చేశారు. పైగా అక్షర్ 2వైడ్లు వేశారు. దీంతో మొత్తం 24రన్స్ వచ్చాయి. ఫలితంగా టార్గెట్ 30బంతుల్లో 30కి వచ్చేసింది. మ్యాచ్ IND చేజారిందని అనుకున్నారంతా. కానీ 16వ ఓవర్లో బుమ్రా కేవలం 4రన్స్ ఇచ్చి మళ్లీ INDను రేసులోకి తెచ్చారు.

News June 30, 2024

నేడు పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు

image

AP: అంతర్జాతీయ నిపుణుల బృందం నేడు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానుంది. అమెరికా, కెనడా నుంచి నలుగురు నిపుణులు 4 రోజుల పాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలపై ఫోకస్ చేయనున్నారు. అక్కడి నిర్మాణాల్లో ఎదురయ్యే సవాళ్లపై అధ్యయనం చేస్తారు. ఆపై జలసంఘం నిపుణులు, అధికారులతో రెండ్రోజుల పాటు చర్చించి నివేదికను అందిస్తారు.