News June 25, 2024

ఈసారి వరల్డ్ కప్ టీమ్ ఇండియాదే: అక్తర్

image

టీ20 వరల్డ్ కప్ గెలిచేందుకు వందకు వంద శాతం అర్హత టీమ్ ఇండియాకే ఉందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. ఈ సారి భారత్ ఖచ్చితంగా గెలవాలని ఆయన కోరారు. ‘వన్డే వరల్డ్ కప్‌లోనే రోహిత్ శర్మ ట్రోఫీ గెలవాల్సింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో భారత్ అధ్బుతంగా ఆడుతోంది. ఈసారి ఖచ్చితంగా ఆ జట్టే గెలవాలి. ఉపఖండంలోనే WC ట్రోఫీ ఉండాలి. ఇప్పుడు ట్రోఫీ గెలిచేందుకు రోహిత్ పూర్తిగా అర్హుడు’ అని ఆయన పేర్కొన్నారు.

News June 25, 2024

కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ

image

లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ చేతిలో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. నిన్న తిహార్ జైలులో ఆయనను ప్రశ్నించి, స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. రేపు సీబీఐ ట్రయల్ కోర్టులో CMను హాజరుపర్చనుంది. కాగా మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. కాగా ఇవాళ బెయిల్ విషయమై హైకోర్టులో ఢిల్లీ సీఎంకు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.

News June 25, 2024

మాజీ ఎంపీ ఎంవీవీకి హైకోర్టులో చుక్కెదురు

image

AP: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో చుక్కెదురైంది. హయగ్రీవ సంస్థకు చెందిన భూముల వ్యవహారంలో తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్‌కు పిటిషన్ పెట్టుకోవాలని సూచించింది. విచారణను 2వారాలకు వాయిదా వేసింది.

News June 25, 2024

జర్నలిస్టుల బస్‌పాస్‌లపై TGSRTC నిర్ణయం

image

TG: సాంకేతిక కారణాల వల్ల అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టుల బస్‌పాస్‌ల అప్లికేషన్లను ఆన్‌లైన్‌లో స్వీకరించడం లేదని TGSRTC ప్రకటించింది. జూన్ 26వ తేదీ నుంచి సమీపంలోని బస్‌పాస్ సెంటర్లకు నేరుగా వెళ్లి పాస్‌లు తీసుకోవాలని సూచించింది. జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్ కార్డు, పాత బస్‌పాస్ చూపించి కొత్తవి తీసుకోవాలని కోరింది.

News June 25, 2024

ఎయిడ్స్ రోగుల కోసం తెలంగాణ కీలక నిర్ణయం

image

TG: ఎయిడ్స్ రోగులకోసం కొత్తగా మరో 16 యాంటీరిట్రోవైరల్ థెరపీ(ఏఆర్టీ) కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 కేంద్రాలున్నాయి. కొత్తగా వచ్చేవాటితో కలిపి జిల్లాకు ఒక కేంద్రం అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. వైద్య కళాశాలల్లో ఏర్పాటు చేయనున్న ఈ ఏఆర్టీ సెంటర్లలో ఒక డాక్టర్, ఐదుగురు సిబ్బంది ఉంటారు.

News June 25, 2024

ఎక్కువ సేపు కూర్చొని పనిచేస్తున్నారా? ఇలా చేయండి!

image

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి కాఫీ రక్షిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. సమతుల్య ఆహారంలో భాగంగా కాఫీని మితంగా తీసుకోవడం బెటర్ అని తెలిపింది. కాఫీ తాగేవారితో పోలిస్తే తాగనివారు ఏ కారణంతోనైనా చనిపోయే అవకాశం 1.6 రెట్లు ఎక్కువని చెప్పింది. కాఫీ తాగనివారు రోజుకు 6+ గంటలు కూర్చొని పనిచేస్తే చనిపోయే ప్రమాదం 60% ఎక్కువ అని BMC పబ్లిక్ హెల్త్ జర్నల్‌‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది.

News June 25, 2024

ముగ్గురు కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ విన్నపాలు

image

HYDలో 2450 ఎకరాల రక్షణ శాఖ భూమిని రాష్ట్రానికి బదిలీ చేస్తే రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాజ్‌నాథ్ సింగ్‌కు CM రేవంత్ విన్నవించారు. TGకి 2.70లక్షల ఇళ్లను మంజూరు చేయాలని మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కోరారు. PMAY(U) కింద గ్రాంటుగా రూ.78,488 కోట్ల బ‌కాయిలు ఇవ్వాలని ప్రతిపాదించారు. అలాగే జాతీయ ఆరోగ్య మిషన్ కింద TGకి రావాల్సిన రూ.693.13 కోట్లు విడుదల చేయాలని JP నడ్డాకు విజ్ఞప్తి చేశారు.

News June 25, 2024

మీమర్స్ చేసిన పనికి ఏడ్చేసిన పవన్ కళ్యాణ్ కూతురు

image

తనను ఎగతాళి చేస్తూ ఓ మీమ్ పేజ్ చేసిన పోస్టును చూసి కూతురు ఆద్య ఏడ్చేసిందని రేణూ దేశాయ్ మండిపడ్డారు. ‘సెలబ్రెటీలు, రాజకీయనేతల ఫ్యామిలీని ఎగతాళి చేసే మీరంతా ఒక్కసారి మీ ఇంట్లోనూ తల్లులు, సిస్టర్స్ ఉన్నారని గుర్తుంచుకోండి. ఈ రోజు నా కుమార్తె అనుభవించిన బాధ, ఆమె కన్నీళ్లు మీకు చెడు చేస్తాయని గుర్తుంచుకోండి. మీమర్స్‌కు ఈ తల్లి శాపం తగులుతుంది’ అని పవన్, లెజినొవాతో తన పిల్లలున్న ఫొటోను పోస్ట్ చేశారు.

News June 25, 2024

మహిళల ఆసియా కప్ షెడ్యూల్ విడుదల

image

మహిళల ఆసియా కప్-2024 షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెలలో శ్రీలంక వేదికగా జరిగే ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, నేపాల్, గ్రూపు-బీలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్ లాండ్ జట్లు ఉన్నాయి. రెండు గ్రూపుల్లో టాప్-2గా నిలిచిన జట్లు సెమీస్ చేరనున్నాయి. జులై 19న పాక్, 21న UAE, 23న నేపాల్ జట్లతో భారత్ తలపడనుంది. 26న సెమీఫైనల్ మ్యాచులు, 28న ఫైనల్ జరగనుంది.

News June 25, 2024

నియోజకవర్గాల్లో జనవాణి చేపట్టాలి: పవన్

image

AP: ఎన్నికలకు ముందు జనసేన నిర్వహించిన జనవాణి విజయవంతమైందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘MLAలు కూడా నియోజకవర్గాల్లో ప్రతి నెలా జనవాణి చేపట్టాలి. ఎంపీలు, MLAలు నియోజవర్గ స్థాయిలో అభినందన కార్యక్రమాలు చేపట్టాలి. మీ గెలుపు కోసం తోడ్పడిన కూటమి నాయకులు, పార్టీ నాయకులను అభినందించాలి. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసిన జనసైనికులు, వీరమహిళలను గుర్తించండి’ అని MLAలను ఆదేశించారు.