News June 19, 2024

ఛార్జ్ తీసుకున్న హోం మినిస్టర్ అనిత

image

AP: రాష్ట్ర హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. తొలుత సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో వేద పండితులతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. పోలీసులు, ఉన్నతాధికారులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై అనిత 43వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో నెగ్గారు.

News June 19, 2024

నాకు న్యాయం జరగాల్సిందే.. ఎవర్నీ వదలను: జేసీ

image

AP: YCP ప్రభుత్వ హయాంలో తనకు చాలా అన్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ‘చిన్న కారణాలతో నా బస్సులు సీజ్ చేశారు. నాపై, నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. జైలుకు పంపి అన్నం కూడా పెట్టనివ్వలేదు. ఎంతో ఏడ్చాం. నా బండ్లు పట్టుకున్న బ్రేక్ ఇన్స్‌పెక్టర్ల ఇళ్ల ముందు కూర్చుంటా. నా బండ్లన్నీ రిపేర్ చేసి ఇవ్వాలి. ఈ విషయం వదిలిపెట్టను.. అవసరమైతే TDPకి రాజీనామా చేస్తా’ అని అన్నారు.

News June 19, 2024

చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ మృతి

image

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా లంగ్స్ డ్యామేజ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు సినీవర్గాలు తెలిపాయి. శ్రీజ కొణిదెల 2007లో శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకోగా.. 2014లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2019లో శిరీష్ మరో పెళ్లి చేసుకున్నారు.

News June 19, 2024

గ్రూప్-2 అభ్యర్థులకు BIG ALERT

image

AP: గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యతను మార్చుకునేందుకు అభ్యర్థులకు APPSC అవకాశం కల్పించింది. పోస్టుల ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాలు, మండల, జిల్లా ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. ఈ నెల 25వ తేదీ రాత్రి 11.59 వరకు మాత్రమే అవకాశం ఉంటుందని APPSC తెలిపింది. ఆ తర్వాత మరో అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

News June 19, 2024

25న ఇంటర్ అడ్వాన్స్‌డ్ ఫలితాలు

image

TG: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన వారు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. గత పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీకోడింగ్, ఆన్‌లైన్‌లో మార్కుల ఎంట్రీ పూర్తైంది. ఏవైనా అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఈ నెల 26 లేదా 27న విడుదల చేస్తారు.

News June 19, 2024

విరాట్.. పేరు కాదు ఓ బ్రాండ్!

image

కెరీర్లో చివరి దశకు చేరుకుంటున్నా విరాట్ కోహ్లీకి ఉన్న బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. భారత్‌లో అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్నవారి జాబితాలో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. క్రాల్ కన్సల్టెన్సీ వివరాల ప్రకారం.. విరాట్ బ్రాండ్ విలువ రూ.1899 కోట్లుగా ఉంది. రెండో స్థానంలో నటుడు రణ్‌వీర్ సింగ్(రూ. 1692కోట్లు) ఉన్నారు. ధోనీ (రూ.798 కోట్లు), సచిన్ (రూ.761 కోట్లు) వరుసగా 7, 8 స్థానాల్లో ఉన్నారు.

News June 19, 2024

VIRAL.. పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసు ముందు నేమ్ బోర్డు

image

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడ నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లో ఆయన క్యాంప్ ఆఫీసు ఉంది. దీంతో ఆ ఆఫీసు ముందు ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్.. గౌ॥ ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటిసరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు అని నేమ్ బోర్డుపై రాసి ఉంది.

News June 19, 2024

బుల్ జోరు.. సరికొత్త గరిష్ఠాలను తాకిన సూచీలు

image

ట్రేడింగ్ సెషన్ ఓపెనింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్లు జోరు కొనసాగిస్తున్నాయి. ఈరోజు కూడా లాభాలతో ప్రారంభమైన సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. గరిష్ఠంగా 77,581ను తాకిన సెన్సెక్స్ ప్రస్తుతం 160 పాయింట్ల లాభంలో 77,454 వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఓ దశలో 23,630 మార్క్ అందుకున్న నిఫ్టీ ప్రస్తుతం 23,587 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఐటీ రంగాల్లో లాభాలు, బడ్జెట్‌పై అంచనాలు మార్కెట్లకు కలిసొచ్చాయి.

News June 19, 2024

హర్మన్ సేన జోరు కొనసాగేనా?

image

ఇవాళ దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు రెండో వన్డే ఆడనుంది. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచులో అన్ని విభాగాల్లో అదరగొట్టి జోరు మీదున్న హర్మన్ సేన అదే ఊపులో సిరీస్‌ను గెలుచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News June 19, 2024

అప్పటి YCP విజయం నిజం కాదా?: యామినీ శర్మ

image

AP: ఈవీఎంలపై వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని BJP నాయకురాలు సాధినేని యామినీ శర్మ మండిపడ్డారు. 2019లో YCPకి ప్రజలకు 151 సీట్లు కట్టబెట్టినపుడు ఉపయోగించింది ఇవే ఈవీఎంలు అని అన్నారు. అప్పుడు మాత్రం వాటి నిషేధం గురించి మాట్లాడలేదని దుయ్యబట్టారు. అంటే నాటి వైసీపీ విజయం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఘోర ఓటమితో YCP భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు.