News June 15, 2024

వారికే రైతు భరోసా: మంత్రి

image

TG: బీఆర్ఎస్ హయాంలో పంటలు సాగు చేయని వారికీ రైతు బంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దీనివల్ల పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఉందని తెలిపారు. అందుకే సాగు చేసే వారికే రైతు భరోసా ఇవ్వాలని తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పంటల బీమా పథకాన్ని కూడా అర్హులకే వర్తించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News June 15, 2024

కార్ల కొనుగోళ్లలో తగ్గిన జోరు?.. చిక్కుల్లో డీలర్స్! – 1/2

image

ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్న వేళ చిన్న కార్లు సహా పలు మోడల్స్ విక్రయాలు స్లో అవడంపై డీలర్లు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వివిధ కార్ల బ్రాండ్లకు చెందిన 4.5లక్షల యూనిట్లు డీలర్ల వద్దే ఉండిపోయాయట. వీటి విలువ దాదాపు రూ.54వేల కోట్లు ఉంటుందని అంచనా. ముఖ్యంగా మారుతీ, హ్యుందాయ్ డీలర్లకు ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక తయారీ ప్లాంట్లలోనూ రూ.20వేలకోట్ల విలువైన స్టాక్ ఉండిపోయినట్లు సమాచారం.

News June 15, 2024

డిస్కౌంట్స్ ఇస్తున్నప్పటికీ..! – 2/2

image

డీలర్లకు స్టాక్ ఇవ్వడం వరకే సంస్థలు ప్రాధాన్యం ఇవ్వడం, కొనుగోలుదారుల ఛాయిస్ మారడం సేల్స్ నెమ్మదించడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. దీంతో డీలర్లు డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తోంది. అత్యధికంగా హ్యుందాయ్‌‌లో కోనా ఎలక్ట్రిక్‌కు రూ.3లక్షలు, జిమ్నీకి రూ.50వేలు, టాటాలో నెక్సాన్ పెట్రోల్ 2023 మోడల్‌కు రూ.55వేల డిస్కౌంట్ ఉంటోంది. 20 రోజుల్లో సేల్ అయ్యే స్టాక్‌కు 50 రోజులు పడుతోందని డీలర్లు వాపోతున్నారు.

News June 15, 2024

సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో మాట్లాడుతున్న ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కోర్టు నోటీసులు పంపింది. ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఆ వీడియోలను తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను, మరో ఐదుగురికి కూడా ఆదేశాలు జారీ చేసింది.

News June 15, 2024

తెలంగాణ జిల్లాలకు కొత్త కలెక్టర్లు

image

★ కామారెడ్డి: ఆశిశ్‌ సంఘ్‌వాన్‌
★ హనుమకొండ: ప్రావిణ్య
★ మంచిర్యాల: కుమార్ దీపక్
★ వికారాబాద్‌: ప్రదీప్ జైన్
★ నల్గొండ: నారాయణరెడ్డి
★ వనపర్తి: ఆదర్శ్‌ సురభి
★ సూర్యాపేట: తేజశ్ నందలాల్ పవార్ ★ వరంగల్: సత్య శారదాదేవి
★ ములుగు: టీఎస్ దివాకర ★ నిర్మల్: అభిలాశ్ అభినవ్

News June 15, 2024

తెలంగాణలో 20 మంది ఐఏఎస్‌ల బదిలీ

image

TG: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది. 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా బదావత్‌ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, భద్రాద్రి కలెక్టర్‌గా జితేశ్ వి పాటిల్ నియమితులయ్యారు.

News June 15, 2024

పవన విద్యుత్‌ ఉత్పత్తిపై సింగరేణి ఫోకస్

image

TG: పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం సంస్థ పరిధిలోని ఉపరితల గనుల మట్టిదిబ్బలు, కొండలు, గుట్టలపై గాలిమరలు ఏర్పాటు చేయనుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి ప్లాంట్లపై అధ్యయనం చేస్తోంది. గాలిమరల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలేవి? వాటిని ఏ దిశలో అమర్చాలి? వాటితో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు? వంటి అంశాలపై మెస్సర్స్ పీఈసీ(ఢిల్లీ) సంస్థతో రీసెర్చ్ చేయిస్తోంది.

News June 15, 2024

కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డి తప్పుకోవాలి: KCR

image

TG: విద్యుత్ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణలో ఏమాత్రం నిష్పాక్షికత కనిపించట్లేదని మాజీ CM KCR అన్నారు. ‘విచారణ అనేది పవిత్రమైన బాధ్యత. కానీ కమిషన్ ఛైర్మన్ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతున్నట్లుంది. అందుకే నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు’ అని లేఖలో పేర్కొన్నారు. కమిషన్ ఛైర్మన్‌గా నరసింహారెడ్డి తప్పుకోవాలని KCR సూచించారు.

News June 15, 2024

తెలివితో రాత మారింది.. విధి మారలేదు!

image

రొమేనియా వాసి, గణిత మేధావి స్టెఫాన్ మాండెల్ 1950సం.లో ఓ చిరుద్యోగి. జీతం చాలక లాటరీలపై ఫోకస్ చేసి గెలిచే ఛాన్స్ గల టికెట్లు కొనేందుకు ఓ సూత్రం కనిపెట్టాడు. దీంతో 1960-70 మధ్య 14 జాక్‌పాట్‌లతో ₹200Cr పైగా గెలిచాడు. అనంతరం సిండికేషన్ పెట్టి సభ్యులకు ఈ సలహాలిచ్చాడు. కానీ ఈ విధానంపై ప్రభుత్వం, లాటరీ సంస్థలు కోర్టులకెళ్లాయి. దీంతో న్యాయ పోరాటాలకే ఆస్తులన్నీ ఖర్చై మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నాడు.

News June 15, 2024

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది నక్సల్స్ హతం

image

ఛత్తీస్‌‌గఢ్‌లోని అబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నారాయణ్‌పుర్, కాంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాలకు చెందిన జవాన్లు సంయుక్తంగా ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.