News June 14, 2024

డిసెంబర్‌లో ‘పుష్ప 2’ రిలీజ్?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉంది. షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల తేదీ వాయిదా పడినట్లు టాక్. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

News June 14, 2024

ప్రధాని, కేంద్ర మంత్రులకు పవన్ కృతజ్ఞతలు

image

AP: దేశంలో, రాష్ట్రంలో NDA కూటమి విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులకు మంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. మోదీతోపాటు అమిత్ షా, గడ్కరీ, నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రదాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, మన్‌సుఖ్ మాండవీయ, బండి సంజయ్, కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, సింధియాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో వరుస ట్వీట్లు చేశారు.

News June 14, 2024

సూపర్-8కు దూసుకెళ్లిన అఫ్గాన్

image

టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ సూపర్-8కు దూసుకెళ్లింది. పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు చేరి సూపర్-8లో అడుగుపెట్టింది. 96 పరుగుల టార్గెట్‌ను అఫ్గాన్ 15.1 ఓవర్లలోనే ఛేదించింది. గుల్బదిన్ నాయబ్ (49) రాణించారు. అంతకుముందు ఫజల్లా ఫారూఖీ 3, నవీన్ ఉల్ హక్ 2 వికెట్లతో చెలరేగడంతో పపువా న్యూగినియా 95 పరుగులకే కుప్పకూలింది.

News June 14, 2024

వయనాడ్ బరిలో ప్రియాంకా గాంధీ?

image

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వయనాడ్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాహుల్ గాంధీ ఈ స్థానానికి రాజీనామా చేయనున్నారని సమాచారం. దీంతో ఈ స్థానం నుంచి ప్రియాంకా రాజకీయ అరంగేట్రం చేయనున్నారని టాక్. కాగా గతంలో కూడా ఆమె ప్రధాని మోదీపై వారణాసిలో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోనియా గాంధీ వదులుకున్న రాయ్‌బరేలీ నుంచి కూడా ఆమె పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు.

News June 14, 2024

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి వచ్చిన 82.82 లక్షల దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

News June 14, 2024

పెరిగిన పెన్షన్లు.. జీవో జారీ

image

APలో పెన్షన్ల పెంపుపై సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సామాజిక పెన్షన్ల పేరును ఎన్టీఆర్ భరోసాగా పునరుద్ధరిస్తూ జీవో విడుదల చేశారు. ఇక నుంచి వృద్ధులు, వితంతువులు, మత్స్యకారులు, తదితరులకు నెలకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6వేల పెన్షన్ అందనుంది. పెరిగిన పెన్షన్లను APR నుంచే ఇస్తామని గతంలో CBN చెప్పగా.. జులై 1న రూ.7వేల పెన్షన్ అందనుంది. అంటే APR, మే, జూన్ నెలల అరియర్స్ రూ.3వేలు వస్తాయి.

News June 14, 2024

టీమ్ ఇండియా సూపర్-8 మ్యాచులు ఇవేనా?

image

టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో సూపర్-8కు దూసుకెళ్లింది. ఇందులో భాగంగా ఈ నెల 20న గ్రూప్ Cలోని అఫ్గానిస్థాన్, 22న గ్రూప్ Dలోని బంగ్లాదేశ్‌‌తో ఇండియా మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ ఉంది. అలాగే 24న గ్రూప్ Bలోని ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఏవైనా అనూహ్య మార్పులు జరిగితే తప్ప ఇదే జట్లతో భారత్ సూపర్-8 మ్యాచులు ఆడనుంది. కాగా రేపు ఫ్లోరిడాలో కెనడాతో టీమ్ ఇండియా చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

News June 14, 2024

అదరగొడుతున్న అఫ్గాన్ బౌలర్లు

image

టీ20 WCలో అఫ్గానిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ ప్రత్యర్థి జట్లను 100 పరుగుల్లోపే ఆలౌట్ చేశారు. వీరి ధాటికి ఉగాండా 58, న్యూజిలాండ్ 75, పపువా న్యూ గినియా 95 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. ఫారూఖీ 3 మ్యాచుల్లో 12 వికెట్లతో టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నారు. రషీద్‌ఖాన్ 6 వికెట్లు పడగొట్టారు.

News June 14, 2024

రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి

image

*ఆరోగ్యంగా ఉన్న 18-60 ఏళ్లలోపు వారు రక్తదానానికి అర్హులు.
*హెపటైటిస్ B, C, HIV, హై బీపీ ఉన్నవారు చేయొద్దు.
*స్మోకింగ్ చేసే వారు కూడా చేయొచ్చు.
*డయాబెటిస్‌కు ఇన్సులిన్ తీసుకుంటున్న వారు చేయకూడదు.
*ఆరోగ్యవంతులైన పురుషులు ప్రతి 3 నెలలకోసారి, ఆరోగ్యవంతమైన మహిళలు ప్రతి 4 నెలలకోసారి చేయొచ్చు.
* ఏ రకమైన క్యాన్సర్ ఉన్నా రక్తదానానికి అనర్హులు.
>>నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

News June 14, 2024

మరో 3 రోజులు వర్షాలు

image

రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించడంతో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. KNR, PDPL, BPL, NLG, SPT, MHBD, WGL, HMK, SDPT, BNR, RR, HYD, VKD, SND, MDK, ములుగు, జనగామ జిల్లాల్లో రేపు ఉదయం వరకు వర్షాలు పడతాయని తెలిపింది. అటు APలో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది.