News June 12, 2024

రేపటి నుంచి స్కూళ్లు.. విద్యార్థులకు ‘స్టూడెంట్ కిట్’ పంపిణీ

image

APలో రేపటి నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఇవాళే ప్రారంభం కావాల్సి ఉండగా CBN ప్రమాణ స్వీకారం నేపథ్యంలో టీచర్ సంఘాల విజ్ఞప్తితో ఇవాళ సెలవు ఇచ్చారు. రేపు స్కూళ్లలో ‘జగనన్న విద్యా కానుక’ను స్టూడెంట్ కిట్ పేరుతో విద్యార్థులకు అందించనున్నారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని PM-పోషణ్ గోరుముద్ద పేరుతో అమలు చేస్తారు.

News June 12, 2024

జగన్ ఫొటో ఉన్నా చంద్రబాబు కాదనలేదు: TDP

image

AP: చంద్రబాబు పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని TDP ట్వీట్ చేసింది. ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృథా కాకూడదు. పాలనలో పగ, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని జగన్ బొమ్మ ఉన్నా స్కూల్ పిల్లల కిట్స్‌ను అలాగే పంపిణీ చేయమని సీఎం చంద్రబాబు ఆదేశించారు’ అని Xలో పోస్ట్ చేసింది.

News June 12, 2024

T20WC: టీమ్ఇండియా టార్గెట్ 111

image

T20WCలో భాగంగా USAతో మ్యాచ్‌లో భారత బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ విజృంభించారు. 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. పదునైన బంతులతో ఆతిథ్య జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. అర్ష్‌దీప్‌‌కు పాండ్య, అక్షర్ తోడవడంతో అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 110/8 రన్స్ మాత్రమే చేయగలిగింది. నితీశ్ కుమార్ 27 టాప్ స్కోరర్. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రోహిత్ సేన సూపర్-8లోకి అడుగుపెట్టనుంది.

News June 12, 2024

భారత్‌తో మ్యాచ్.. USA చెత్త రికార్డు

image

భారత్‌తో జరుగుతున్న మ్యాచులో USA చెత్త రికార్డు నమోదు చేసింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియాపై పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. ఇవాళ్టి మ్యాచులో USA 6 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 18 పరుగులు చేసింది. ఈ WCలో ఇది మూడో అత్యల్ప స్కోరు. దక్షిణాఫ్రికా(16/4), నమీబియా(17/3) ముందు స్థానాల్లో ఉన్నాయి.

News June 12, 2024

భలే దొంగలు.. ఎవరూ గుర్తించలేకపోయారు!

image

టెలిఫోన్ లైన్ కాపర్ కేబుళ్లను దొంగిలించేందుకు కొందరు రోడ్డు, ఫుట్‌పాత్‌ను తవ్వేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులమని చెప్పి ముంబైలోని అంబేడ్కర్ రోడ్డులో 200 మీటర్ల మేర తవ్వేశారు. MTNL అధికారులు వచ్చి చెక్ చేయగా కాపర్ వైరు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు CCTVని చెక్ చేశారు. గత నెలలో ఈ ఘటన జరగ్గా, పోలీసులకు పట్టుబడిన నిందితులకు కోర్ట్ రిమాండ్ విధించింది.

News June 12, 2024

PIC OF THE DAY

image

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక స్టేజీపై ఉన్న కేంద్ర మంత్రులకు నమస్కరించారు. ఆ సమయంలో ఆయనను గౌరవిస్తూ కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నడ్డా, రామ్ మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లేచి నిలబడి నమస్కరించారు. ఈ ఫొటోను టీడీపీ శ్రేణులు షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని పోస్ట్ చేస్తున్నాయి. కేంద్రంలోని NDA ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు.

News June 12, 2024

ఛార్జీలు పెంచలేదు.. RTC ప్రకటన

image

TG: బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని TGSRTC ఛైర్మన్ సజ్జనార్ ప్రకటించారు. ‘హైవేలపై కేంద్రం ఇటీవల టోల్ ఛార్జీలను పెంచడంతో టికెట్‌లో టోల్ సెస్‌ను సవరించాం. ఈ నెల 3వ తేదీ నుంచి టోల్ ప్లాజాలున్న రూట్లలోనే ఇవి అమల్లోకి వచ్చాయి. సాధారణ రూట్లలో ఛార్జీల్లో మార్పు చేయలేదు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం’ అని ఆయన హెచ్చరించారు.

News June 12, 2024

రేపు గ్రూప్-1 ‘కీ’ అందుబాటులోకి

image

TG: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ‘కీ’ని రేపటి నుంచి ఈ నెల 17 వరకు TGPSC వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా ‘కీ’ని సరిచూసుకోవాలని సూచించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే రేపటి నుంచి 17 సాయంత్రం 5 గంటల వరకు ఈమెయిల్స్ ద్వారా పంపొచ్చని తెలిపారు. ఈ నెల 9న గ్రూప్-1 పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.

News June 12, 2024

YS జగన్ కీలక నిర్ణయం?

image

AP: ఎన్నికల్లో ఘోర ఓటమితో కుంగిపోయిన YCP శ్రేణులను ఉత్తేజపరిచేందుకు మాజీ CM జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ క్యాడర్‌పై జరుగుతున్న దాడులతో బాధితులుగా మారిన వారికి అండగా నిలబడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. త్వరలోనే వారిని పరామర్శించి, భరోసా కల్పిస్తానని జగన్ ఇటీవల నేతలతో భేటీలో చెప్పినట్లు సమాచారం. దీంతో YSJ మరోసారి ఓదార్పు యాత్ర చేస్తారనే ప్రచారం నడుస్తోంది.

News June 12, 2024

‘మెకానిక్ రాకీ’పై ఫేక్ ట్వీట్.. కౌంటర్ ఇచ్చిన విశ్వక్ సేన్

image

రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తోన్న ‘మెకానిక్ రాకీ’ సినిమా నాలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను రూ.8 కోట్లకు విక్రయించినట్లు వస్తోన్న వార్తలను హీరో విశ్వక్ సేన్ ఖండించారు. ఓ నెటిజన్ ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘గాడిద గుడ్డేం కాదు. టీ షాపు ముచ్చట్లు తీసుకొచ్చి ట్విటర్‌లో పెట్టొద్దు ప్రియాజీ. మెకానిక్ రాకీని మేమింకా ఎవరికీ అమ్మనేలేదు. నిజం తెలుసుకోండి. ఇది మేకర్స్ కెరీర్’ అని కౌంటర్ ఇచ్చారు.