India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పన్నుల వాటాలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని తమిళనాడు డీఎంకే మంత్రి తంగం తెనరసు విమర్శించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో 31.5 కోట్ల జనాభా ఉంటే రూ.27,336 కోట్లు కేటాయించిందని చెప్పారు. అదే యూపీ, బిహార్, MPల్లో 44.3 కోట్ల జనాభా ఉంటే రూ.62,024 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. దక్షిణాదికి 15%, ఆ 3 రాష్ట్రాలకు 40% ఇవ్వడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు.
పోప్ ఫ్రాన్సిస్‌కు అమెరికా సర్కారు తమ అత్యున్నత పురస్కారం మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రకటించింది. ఈ నెల 20న జో బైడెన్ పదవీకాలం ముగియనుంది. ఈలోపుగా పలు కీలక నిర్ణయాల్ని ఆయన తీసుకుంటున్నారు. అందులో భాగంగానే పోప్‌నకు పురస్కారాన్ని ప్రకటించినట్లు సమాచారం. కాగా.. ప్రపంచ సుస్థిరత, శాంతికి అద్భుతమైన కృషి చేసినవారికి అమెరికా మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రకటిస్తుంటుంది.
‘చంబల్’ నీటి కష్టాలు తీర్చేందుకు ఓ చీఫ్ ఇంజినీర్ ‘డాకు మహారాజ్’లా ఎలా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. బాలయ్య క్యారెక్టర్ మేకోవర్, యాక్షన్ సీన్లు, తమన్ BGM గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు 20 ని.లు హైలైట్. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్లో అవుతుంది. ఎమోషన్లకు పెద్దపీట వేసి, మాస్ ఎలివేషన్లను తగ్గించారు. క్లైమాక్స్ ముందే ఊహించేలా ఉండటం మైనస్.
RATING: 2.75/5
క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో పుంజుకున్నాయి. మార్కెట్ విలువ 1.20% పెరిగి $3.32Tకి చేరుకుంది. రేంజుబౌండ్లో చలించిన బిట్‌కాయిన్ $126 తగ్గి $94,599 వద్ద ముగిసింది. ప్రస్తుతం $94,597 వద్ద కొనసాగుతోంది. డామినెన్స్ 56.5 శాతంగా ఉంది. ఎథీరియం 1.14% పెరిగి $3279 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ డామినెన్స్ 11.9 శాతంగా ఉంది. XRP 8.98, BNB 0.44, SOL 0.74, DOGE 3.44, ADA 10, AVAX 2.26 శాతం లాభపడ్డాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈచిత్రం టీవీల్లో టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ‘కల్కి’ జీతెలుగులో ప్రసారం కానుంది. దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఈనెల 3 నుంచి జపాన్‌లో స్క్రీనింగ్ అవుతోంది.
తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో యువశక్తి భాగస్వామి కావాలి. సోషల్ మీడియాను మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి’ అని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘యువతకు మార్గదర్శి, భారతీయ ఆధ్యాత్మిక మహర్షి, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ నుంచి ఎవరు హాజరవుతున్నారో తెలిసింది. విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. భారత్‌కు ఆయనే ప్రాతినిధ్యం వహిస్తారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణం చేసి రెండోసారి ప్రెసిడెంట్‌గా వైట్‌హౌస్‌లో అడుగుపెడతారు. ఈ కార్యక్రమానికి ఆయా దేశాల ప్రభుత్వాధినేతలు, వ్యాపారులు, సెలబ్రిటీలు హాజరవుతున్నారు.
కెనడా పీఎం రేసులో ముందంజలో ఉన్న భారత సంతతి మహిళ, అనితా ఆనంద్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీకి చెందిన ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత ఆ పదవిని అనిత స్వీకరిస్తారని అందరూ భావించినప్పటికీ.. తాను కూడా ట్రూడో బాటలోనే వెళ్లాలనుకుంటున్నానని, పదవులపై ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. అనిత తండ్రి తమిళ వ్యక్తి కాగా తల్లి పంజాబీ.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ‘నానా హైరానా’ సాంగ్‌ను యాడ్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నేటి నుంచి థియేటర్లలో ఈ సాంగ్‌తో కూడిన ప్రింట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. తొలుత 14వ తేదీన సాంగ్ యాడ్ చేస్తామని తెలుపగా రెండు రోజుల ముందే వచ్చేసింది. సాంగ్ లేకపోవడంపై సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేయడంతో మేకర్స్ వెంటనే యాడ్ చేసినట్లు తెలుస్తోంది.
వారానికి 90 గంటలు పనిచేయాలన్న SN సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఎడెల్వీస్ మ్యూచువల్‌ఫండ్ CEO రాధికా గుప్తా తప్పుబట్టారు. తన మొదటి జాబ్‌లో ఏకంగా వారానికి 100 గంటలు పనిచేయడంతో మానసిక క్షోభకు గురై బాత్రూమ్‌లో ఏడ్చేదానినని చెప్పుకొచ్చారు. హార్డ్‌వర్క్‌ను ఉద్యోగుల పని గంటలతో పోల్చొద్దని, పనిలో నాణ్యత, ఉత్పాదకత ముఖ్యమన్నారు. ఉద్యోగి శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వర్క్ కల్చర్ కావాలన్నారు.
Sorry, no posts matched your criteria.