News June 5, 2024

పిఠాపురం ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు: వెంకీ మామ

image

ఏపీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని పొందిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కి విక్టరీ వెంకటేశ్ అభినందనలు తెలిపారు. ‘చరిత్రాత్మక విజయాన్ని పొందిన ప్రియమైన పవన్‌కి అభినందనలు. ఈ విజయానికి నువ్వు అర్హుడివి మిత్రమా. నువ్వు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలి. ప్రజలకు సేవ చేయాలనే నీ కృషి, అంకితభావాన్ని కొనసాగించండి. పిఠాపురం ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు’ అని Xలో పోస్ట్ చేశారు.

News June 5, 2024

ఈరోజే రాష్ట్రపతిని కలవనున్న NDA నేతలు!

image

NDA నేతలు ఈరోజే రాష్ట్రపతి ముర్మును కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని వారు రాష్ట్రపతిని కోరనున్నారట. మోదీ, నడ్డా, రాజ్‌నాథ్, నితీశ్ కుమార్, చంద్రబాబు, చిరాగ్ పాస్వాన్, మాంఝీ తదితరులు కలవనున్నట్లు సమాచారం.

News June 5, 2024

ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ కసరత్తు

image

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన బీజేపీ అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు వేగవంతం చేసింది. ఒకటి రెండు రోజుల్లో ఆ పార్టీ సీఎం అభ్యర్థిపై స్పష్టత రానుంది. సీఎం రేసులో జుయల్ ఓరం, ధర్మేంద్ర ప్రదాన్, సంబిత్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఒడిశాలో BJP 78, BJD 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 చోట్ల గెలిచారు. 21 లోక్‌సభ స్థానాలకు BJP 20, కాంగ్రెస్ ఒకచోట గెలిచాయి.

News June 5, 2024

డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం: సీఎం రేవంత్

image

TG: ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవం నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వీటిని సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తామని వివరించారు. సెక్రటేరియట్‌లో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సోనియాగాంధీని ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

News June 5, 2024

ఏపీ అసెంబ్లీ రద్దు

image

ఏపీ అసెంబ్లీని గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. సీఎం జగన్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో 15వ అసెంబ్లీ రద్దయినట్లు అయింది.

News June 5, 2024

Stock Market: సెన్సెక్స్ 2300 పాయింట్లు జంప్

image

స్టాక్‌మార్కెట్లో నేడు రిలీఫ్ ర్యాలీ జరిగింది. బెంచ్‌మార్క్ సూచీలు భారీగా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2303 పాయింట్లు పెరిగి 74,384 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 735 పాయింట్లు ఎగిసి 22,620 వద్ద క్లోజైంది. దీంతో నేడు మదుపరులు రూ.11 లక్షల కోట్ల సంపద పోగేశారు. నిఫ్టీ50లో 48 కంపెనీలు లాభపడగా 2 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో, టాటా స్టీల్, ఎం అండ్ ఎం టాప్ గెయినర్స్.

News June 5, 2024

ప్రారంభమైన NDA నేతల సమావేశం

image

ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో NDA నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్, నడ్డా, గడ్కరీ, చంద్రబాబు, నితీశ్ కుమార్, పవన్ సహా పలువురు NDA పక్ష నేతలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న తొలి NDA భేటీ ఇది. ఈ సమావేశంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు, ప్రధాని ప్రమాణస్వీకారంపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News June 5, 2024

తొలిసారి అసెంబ్లీలోకి మాజీ సీఎం వారసుడు

image

AP: కర్నూలు జిల్లా డోన్‌లో TDP నేత కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి జయకేతనం ఎగురవేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ను ఆయన ఆరు వేల ఓట్ల తేడాతో ఓడించారు. మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు అయిన సూర్యప్రకాశ్ గతంలో 3సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయమంత్రి గానూ పని చేశారు. రాష్ట్రం నుంచి జాతీయ రాజకీయాల్లో రాణించిన ఈ సీనియర్ లీడర్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.

News June 5, 2024

కేజ్రీవాల్‌‌కు చుక్కెదురు

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. వైద్యపరీక్షల కోసం వారం రోజుల బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ వేయగా జడ్జి తోసిపుచ్చారు. ఆయనకు ఈనెల 19 వరకు జుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చారు. కాగా లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్.. ఎన్నికల వేళ మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చారు. ఇటీవలే మళ్లీ జైలులో లొంగిపోయారు.

News June 5, 2024

పార్లమెంట్‌కు ముగ్గురు మహిళామణులు

image

ఏపీ లోక్‌సభ బరిలో తొమ్మిది మంది నారీమణులు నిలిస్తే ముగ్గురు విజయ ఢంకా మోగించారు. రాజమండ్రిలో పురందీశ్వరి(BJP), నంద్యాలలో బైరెడ్డి శబరి(TDP), అరకు- తనూజారాణి(YCP) గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి YS షర్మిల కడపలో, ఏలూరులో లావణ్య ఓడిపోయారు. విశాఖ- బొత్స ఝాన్సీ(YCP), నరసాపురం- గూడూరి ఉమాబాల(YCP), హిందూపురం- శాంత(YCP) ఇంటిబాట పట్టారు. అరకులో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పరాజయం పాలయ్యారు.