India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మోహన్ బాబు ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారించింది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో రూ.24,276 కోట్లతో పనులు, మంగళగిరి ఎయిమ్స్‌కు 10 ఎకరాల కేటాయింపు, వరద ప్రభావిత బాధితులకు రుణాల రీ షెడ్యూల్, పోలవరం ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు, కృషి విజ్ఞాన కేంద్రానికి 50.20 ఎకరాల బదిలీ, ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు వంటి విషయాలపై చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి.
*మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్
*22న సెకండ్ లాంగ్వేజ్
*24న ఇంగ్లిష్
*26న మ్యాథ్స్
*28న ఫిజిక్స్
*29న బయోలజీ
*ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్
>>ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, ఏప్రిల్ 4న ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌పై ఆయన తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. ‘నా కుమారుడికి అవమానాలు ఎదురై ఉండొచ్చు. వాటిని భరించలేకే ఆయన రిటైర్మెంట్ ప్రకటించి ఉండొచ్చు. దీనికి ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయని అనుకుంటున్నా. అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటనతో ఆశ్చర్యం వేసింది. అప్పటివరకు నాకు కూడా ఈ విషయం తెలియదు. వీడ్కోలు పలికినందుకు సగం సంతోషం, సగం బాధగా ఉంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంటు తోపులాట వ్యవహారంలో BJP, కాంగ్రెస్ MPలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. రాహుల్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని BJP మహిళా MP ఫాంగ్నాన్ కొన్యాక్ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు ఫిర్యాదు చేశారు. ‘నా గౌరవ మర్యాదలు, సెల్ఫ్ ఎస్టీమ్‌ను రాహుల్ గాంధీ గాయపరిచారు’ అని పేర్కొన్నారు. BJP MPలు తోసేయడం వల్ల సర్జరీ చేయించుకున్న మోకాలికి గాయమైందని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఫిర్యాదు చేశారు.
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు తిరస్కరణకు గురైంది. 14 రోజులకు ముందుగా నోటీసు ఇవ్వకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. తిరస్కరణపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీని అవమానించేందుకు బీజేపీ ఎంపీలకు ఎక్కువ అవకాశమిస్తున్నారని ప్రతిపక్షాలు కొన్ని రోజుల క్రితం రాజ్యసభ సెక్రటరీకి నోటీసు ఇవ్వడం తెలిసిందే.
AP: కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు కాలేదని, అప్పుడే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని మాజీ CM జగన్ అన్నారు. ఇలాంటి వ్యతిరేకత ఏ ప్రభుత్వానికి రాలేదని చెప్పారు. ‘బాబుని నమ్మొద్దని అప్పుడే ప్రజలకు చెప్పాం. ఆయనను నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే. నేను పలావు పెట్టా.. బాబు బిర్యానీ పెడతానన్నారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ పోయింది. ఇక మేం పోరాటాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంటులో తోపులాట వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. రాహుల్ గాంధీపై కేసు పెట్టేందుకు NDA ఎంపీలు సిద్ధమయ్యారని తెలిసింది. FIR ఫైల్ చేసేందుకు ఇప్పటికే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారని సమాచారం. ‘సహచర ఎంపీలపై భౌతికదాడి చేయొచ్చని ఏ చట్టం ఆయనకు అధికారమిచ్చింది? ఇతర ఎంపీలను కొట్టడానికే కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నారా’ అని అకిడోలో బ్లాక్‌బెల్ట్ ఉన్న RGని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.
మత సామరస్యానికి తాను కట్టుబడి ఉన్నానని, అదే సమయంలో క్రైస్తవుడిగా గర్విస్తున్నానని TN Dy.CM ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. మతాన్ని వాడుకొని సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, ద్వేషం నింపే కొందరి చర్యలను ఆయన తప్పుబట్టారు. ‘మీరు నన్ను క్రిస్టియన్ అనుకుంటే క్రిస్టియన్‌ని, ముస్లిం అనుకుంటే ముస్లింని, హిందువుగా భావిస్తే హిందువును’ అని అన్నారు. అన్ని మతాలు ప్రేమనే నేర్పుతాయన్నారు.
AP: YCP అధినేత, మాజీ CM జగన్‌ను మాజీ మంత్రి జోగి రమేశ్ కలిశారు. నూజివీడులో TDP నేతలతో కలిసి ఆయన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొనడం జిల్లా రాజకీయాలను కుదుపునకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ జగన్‌ను కలిసి వివరణ ఇచ్చారు. అటు, జోగి రమేశ్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష, RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణపై TDP ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.